Truecaller: కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్..అదే...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

Truecaller: కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్..అదే బాటలో అన్ని యాప్ లు.. ఎందుకంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

యూజర్లకు భారీ షాకిస్తూ ట్రూకాలర్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ కొత్త పాలసీలకు అనుగుణంగా తమ యాప్ నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించినట్లు సంస్థ ప్రకటించింది. పూర్తి వివరాలివే..

Truecaller: యూజర్లకు బ్యాడ్ న్యూస్.. కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్.. ఎందుకంటే..

ప్రముఖ కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్ (Truecaller) తన వినియోగదారులందరికీ ఫ్రీగా కాల్ రికార్డింగ్ (Call Recording) ఫీచర్ ఆఫర్ చేస్తుండటం, ఈ ఫీచర్‌ను కోట్లాది మంది వాడుతుండటం తెలిసిందే. కానీ తాజాగా వారందరికీ షాకిచ్చే ఓ నిర్ణయం తీసుకుంది ట్రూకాలర్. గూగుల్ (Google) కొత్త పాలసీలకు అనుగుణంగా తమ యాప్ నుంచి కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించినట్లు ప్రకటించింది. ఫోన్ కాల్‌లను రికార్డ్ చేసే ఆప్షన్‌ను ప్రపంచవ్యాప్తంగా నిలిపివేస్తామని ట్రూకాలర్ కన్ఫామ్ చేయడంతో యూజర్లు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఆప్షన్ అందుబాటులోనే ఉంటుంది. కానీ మే 11 నుంచి యాప్ నుంచి రిమూవ్ అవుతుంది.

ఇటీవలే గూగుల్ సంస్థ గూగుల్ ప్లే స్టోర్‌లోని కాల్ రికార్డింగ్ యాప్‌లకు సంబంధించి పాలసీలను సవరిస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం మే 11 నుంచి అమల్లోకి రానుండగా ఆ సమయం నుంచి గూగుల్ ప్లే స్టోర్‌లో కాల్ రికార్డింగ్ యాప్స్ అందుబాటులో ఉండవు. అలానే ఆండ్రాయిడ్‌లోని ఆల్రెడీ ఉన్న కాల్ రికార్డింగ్ యాప్‌లు పని చేయడం ఆగిపోతాయి. ఆ తరువాత మీరు మీ ఫోన్‌లో వాయిస్ కాల్‌లను రికార్డ్ చేయాలనుకుంటే, మీ స్మార్ట్‌ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఇన్-బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్‌పై ఆధారపడాల్సి వస్తుంది. మీ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌బిల్ట్ కాల్ రికార్డింగ్ ఫీచర్ లేకపోతే మే 11 తర్వాత మీరు కాల్‌లను రికార్డ్ చేయలేరు.

“చాలామంది యూజర్ల అభ్యర్థనల నిమిత్తం మేం ట్రూకాలర్‌లో అన్ని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు కాల్ రికార్డింగ్‌ ఫీచర్‌ను తీసుకొచ్చాం. ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్ అందరికీ ఉచితం. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడానికి గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే అప్‌డేటెడ్ గూగుల్ డెవలపర్ ప్రోగ్రామ్ విధానాల ప్రకారం, గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐ యూజ్ చేసి ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం కుదరదు. ఈ కారణంగా ట్రూకాలర్‌లో కాల్ రికార్డింగ్‌ని అందించలేం” అని అధికారిక ట్రూకాలర్ ప్రతినిధి తాజాగా మీడియాకు చెప్పారు.

కాల్ రికార్డింగ్‌ని కలిగి ఉన్న ఫోన్లపై గూగుల్ న్యూ పాలసీ ప్రభావం చూపదని ట్రూకాలర్ స్పష్టం చేసింది. షియోమీ, శాంసంగ్, వన్‌ప్లస్, ఒప్పో వంటి కొన్ని స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు తమ ఇన్-బిల్ట్ కాల్ రికార్డర్ ఫీచర్‌ను అందిస్తున్నాయి. ఇవి మే 11 తర్వాత కూడా యథాతధంగా పని చేస్తూనే ఉంటాయి.

కాల్ రికార్డింగ్ యాప్‌ల సమస్య ఏంటి?

గూగుల్ మొదటినుంచి కాల్ రికార్డింగ్‌ యాప్స్‌పై వ్యతిరేకతను కనబరుస్తూ వస్తోంది. అంతేకాదు, తన ప్రైవసీ, సేఫ్టీ వ్యూహంలో భాగంగా కాల్ రికార్డింగ్ ఫీచర్ యూజర్లకు గతంలోనే తొలగించింది. ఐతే థర్డ్ పార్టీ అప్లికేషన్లను మాత్రం గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగించి కాల్స్ రికార్డ్ చేస్తున్నాయి. ఈ ఫీచర్‌ని అందించడం కోసం ట్రూకాలర్ తో సహా అన్ని కాల్ రికార్డింగ్ యాప్‌లు యాక్సెసిబిలిటీ ఏపీఐని ఉపయోగిస్తున్నాయి. కానీ కొత్త పాలసీ అమల్లోకి వచ్చాక వీటి సహాయంతో రికార్డ్ చేయడం కుదరదు. ఎందుకంటే కాల్ రికార్డింగ్స్ కోసం తన యాక్సెసిబిలిటీ ఏపీఐకి యాక్సెస్‌ను గూగుల్ తీసివేస్తోంది. అంటే అన్ని థర్డ్ పార్టీ యాప్‌లు రికార్డింగ్ చేసేందుకు యాక్సెస్‌ను పొందలేవు. రోగ్ డెవలపర్లు గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐని దుర్వినియోగం చేస్తూ యూజర్లను ట్రాక్ చేస్తున్నారని గూగుల్ కనిపెట్టింది. అందుకే ఇది గూగుల్ యాక్సెసిబిలిటీ ఏపీఐకి యాక్సెస్‌ను అవసరం ఉన్నవాటికి అందిస్తోంది.

truecaller: కాల్ రికార్డింగ్ ఫీచర్‌ను తొలగించిన ట్రూకాలర్..అదే బాటలో అన్ని యాప్ లు.. ఎందుకంటే..

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this