SBI ATM: డెబిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

SBI ATM: డెబిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు.. ఎలాగంటే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

SBI ATM: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP)తో ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందిస్తోంది.

SBI ATM: డెబిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు.. ఎలాగంటే..!

SBI ATM: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తన ఖాతాదారులకు వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌ (OTP)తో ఏటీఎంల నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునే సదుపాయం అందిస్తోంది. జనవరి 2020 నుంచి ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రూ.10 వేలు.. అంతకంటే ఎక్కువ డబ్బులను విత్‌డ్రా (Cash Withdrawal) చేస్తే రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు బ్యాంకు పంపిన ఓటీపీని ఎంటర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో డెబిట్‌ కార్డు పిన్‌ నంబర్‌ లేకుండా డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు వీలవుతుంది. అయితే చాలా మందికి ఓటీపీని ఉపయోగించి డబ్బులు విత్‌డ్రా ఎలా చేసుకోవాలో తెలియదు. ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రా చేసుకునేందుకు ఓటీపీ అవసరం. నగదు విత్‌డ్రా చేసే సమయంలో బ్యాంకు మీ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నంబర్‌కు ఓటీపీ పంపిస్తుంది. ఓటీపీ అనేది నాలుగు అంకెల నంబర్‌. ఈ ఓటీపీ నంబర్‌ ఒక్కసారి విత్‌డ్రా చేసిన సమయంలో మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
ముందుగా ఎస్‌బీఐ ఏటీఎంను సందర్శించాలి. అక్కడ విత్‌డ్రా చేసే సమయంలో కావాల్సిన మొత్తాన్ని ఏటీఎం స్క్రీన్‌పై ఎంటర్‌ చేసిన తర్వాత ఓటీపీ స్క్రీన్‌ కనిపిస్తుంది. మీ మొబైల్‌ నంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. అయితే ఏటీఎంల వద్ద జరిగే మోసాలను అరికట్టేందుకు ఏటీఎంల ద్వారా కార్డ్‌ రహిత నగదు ఉపసంహరణలు చేసుకునేలా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. అన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని అందించాలని సూచిందింది ఆర్బీఐ. UPIని ఉపయోగిస్తు్న్న అన్ని బ్యాంకులు, ఏటీఎంలలో కార్డ్‌లెస్‌ వ్యవస్థను సదుపాయం కల్పించినట్లు ఆర్బీఐ తెలిపింది. ఈ విధానం ద్వారా డెబిట్‌ కార్డు లేకుండానే ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవచ్చు. అలాగే కార్డ్ స్కిమ్మింగ్‌, క్లోనింగ్ వంటి మోసాల‌ను ఆరికట్టవచ్చని ఆర్బీఐ తెలిపింది.

sbi atm: డెబిట్‌ కార్డు లేకున్నా ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేయవచ్చు.. ఎలాగంటే..!

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this