RTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల సుదీర్ఘ...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

RTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యుడి రథసారథులకు తీపి కబురు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది.

RTC: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం..

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సామాన్యుడి రథసారథులకు తీపి కబురు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం పెరుగుతోంది. వచ్చేవేతనాల నుంచి అందుకునేలా 5 శాతం డీఏను చెల్లించనున్నట్టు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. మూల వేతనంపై ఐదు శాతం అంటే.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్‌ వంటి యూనిఫారం ఉద్యోగులకు కనిష్టంగా రూ.600 నుంచి గరిష్టంగా రూ.1,500 వరకు భత్యం జతకలుస్తుంది. వివిధ కేటగిరీల్లోని అధికారులకు రూ.1,500 నుంచి రూ.5,500 వరకు వేతనం అదనంగా అందనుంది. ఈ డీఏ ప్రకటనతో ఆర్టీసీపై నెలకు రూ.5 కోట్ల వరకు భారం పడుతుం దని అధికారులు చెప్తున్నారు. వాస్తవానికి ఉద్యోగులు 2019లో సుదీర్ఘ సమ్మె చేయటం, తర్వాత కోవిడ్‌ దెబ్బతో.. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి బాగా దెబ్బతిని, డీఏల చెల్లింపు ఆగిపోయింది. ఆర్టీసీలో పనిచేస్తున్న 48 వేల మందితోపాటు 2019 జూలై నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఇది వర్తింపు.

ఆరు డీఏలు కలిపి 27శాతం వరకు రావాల్సి ఉందని.. వెంటనే చెల్లించాలని ఉద్యోగులు చాలా రోజులుగా డిమాండ్‌ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజా డీఏ పెంపుపై ఆదేశాలు జారీ చేసినప్పటికీ.. బకాయిల అంశాన్ని మాత్రం ప్రస్తావించలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు అధికారికంగా ఎలాంటి ప్రకటన కూడా చేయలేదు ఆర్టీసీ యాజమాన్యం.

rtc: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత కరువు భత్యం..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this