Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), కన్నడ స్టార్ రాఖీభాయ్ యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా సంచలన విజయం సాధించింది.

Ram Charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel), కన్నడ స్టార్ రాఖీభాయ్ యశ్ కాంబోలో వచ్చిన కేజీఎఫ్ 2 (KGF 2) సినిమా సంచలన విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టి్స్తోంది. ఏప్రిల్ 14న విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకు దాదాపు రూ. 700 కోట్లకు పైగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. యశ్ నటనపై.. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇటీవల టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేజీఎఫ్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రాకింగ్ స్టార్ యశ్ నటనపై.. కేజీఎఫ్ 2 సినిమాపై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చేశాడు. యశ్ నటన మైండ్ బ్లోయింగ్ అని.. కేజీఎఫ్ 2 సినిమా అద్భుతమంటూ చెప్పుకొచ్చాడు.
” కేజీఎఫ్ 2 సినిమా ఇంత పెద్ద విజయం సాధించినందుకు నా బ్రదర్ యశ్‏కు, డైరెక్టర్ ప్రశాంత్ నీల్‏కు శుభాకాంక్షలు. యశ్ నటన మైండ్ బ్లోయింగ్..స్రీన్ మీద ఎంతో కమాండబుల్‏గా అనిపించాడు. సంజయ్ దత్, రవీనా టాండన్, ప్రకాష్ రాజు, రావు రమేష్ గారు కెరీర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చారు. ఇప్పటివరకు ఇదే అత్యుత్తమ నటన అనిపించేలా ఉంది. శ్రీనిధి శెట్టి, మాళవిక అవినాష్, ఈశ్వరీ రావు, అర్చనా జోయిస్, రవి బస్రూర్ అందరూ నటన అద్భుతమనిపించారు. సాంకేతిక నిపుణులందరికీ కుదోస్ ” అంటూ రాసుకోచ్చారు చరణ్.
ప్రస్తుతం చరణ్ ఆచార్య సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నా సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమాకు మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఈరోజు సాయంత్రం యూసఫ్ గూడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.

ram charan: నీ నటన మైండ్ బ్లోయింగ్..కేజీఎఫ్ 2 అద్భుతం.. యశ్ పై చరణ్ ప్రశంసలు..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this