KGF 2: కేజీఎఫ్‌కు బిగ్ షాక్.. తెరపైకి...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

KGF 2: కేజీఎఫ్‌కు బిగ్ షాక్.. తెరపైకి వచ్చిన రియల్ రాఖీ భాయ్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

1997లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో రియల్ రాఖీ భాయ్ థంగం మృతి చెందాడు. ఇప్పుడు అతడి కథనే ‘కేజీయఫ్’ సినిమాలో చూపించారంటూ థంగం ఫ్యామిలీ ఆరోపిస్తోంది.

KGF 2: కేజీఎఫ్‌కు బిగ్ షాక్.. తెరపైకి వచ్చిన రియల్ రాఖీ భాయ్

ప్రస్తుతం కేజీఎఫ్(KGF) హవా నడుస్తోంది. పోయిన గురువారం రిలీజ్ అయిన కెజిఎఫ్ వారం రోజుల్లోనే కలెక్షన్ల కింగ్‌గా మారింది. వారం రోజుల్లోనే 250 కోట్ల కలెక్షన్లు దాటి బాలీవుడ్ లో సరికొత్త రికార్డ్ సెట్ చేసింది. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కించిన ‘కేజీయఫ్’ (KGF) చిత్రం ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. రెండు చాఫ్టర్లతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

అయితే తాజాగా ఈ సినిమా యూనిట్‌కు షాక్ తగిలింది. ఇది తమ జీవితంలో జరిగిన యదార్థ ఘటన అంటూ… రియల్ రాఖీ భాయ్(Real Rocky Bhai) ఫ్యామిలీ తెరపైకి వచ్చింది. కేజీయఫ్‌లో రాఖీ భాయ్ అనే పాత్ర నిజజీవితంలో నుండి తీసుకున్నదే అని గతంలో దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా చెప్పిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన థంగం అనే వ్యక్తి కోలార్ గోల్డ్(Colar gold mines) గనుల్లో పనిచేస్తూ.. అక్కడ ఓ గ్యాంగ్‌ను క్రియేట్ చేసుకున్నాడు. తన గ్యాంగ్ సహాయంతో కోలార్ గనుల్లో బంగారాన్ని కొల్లగొడుతూ జూనియర్ వీరప్పన్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఇక తాను కొల్లగొట్టిన గోల్డ్‌ను ప్రజలకు కూడా పంచిపెట్టేవాడు.

1997లో పోలీసుల ఎన్‌కౌంటర్‌లో(Encounter) థంగం మృతి చెందాడు. ఇప్పుడు అతడి కథనే ‘కేజీయఫ్’ సినిమాలో చూపించారంటూ థంగం తల్లి పాలీ ఆరోపిస్తుంది. తమను సంప్రదించకుండానే, తన కొడుకు కథను ఎలా సినిమా తీస్తారని.. తాను చట్టపరంగా ముందుకు వెళ్తానంటూ కేజీయఫ్(KGF) చిత్ర టీమ్‌కు షాకిచ్చింది రియల్ రాఖీ భాయ్ తల్లి. దీంతో కేజీయఫ్ చిత్ర యూనిట్‌కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది.

మరోవైసు కెజిఎఫ్ ..2 ఏమాత్రం తగ్గకుండా కలెక్షన్లు కంటిన్యూ చేస్తోంది. ఇప్పుడు కేజీఎఫ్ కలెక్షన్లకు బ్రేకులు వేసే సినిమాలు కూడా ఏం లేవు. ఒక వేళ జెర్సీ మూవీ బాలీవుడ్ లో రిలీజ్ అయినా కూడా కెజిఎఫ్ క్రేజ్ ని దాటడం కష్టమే అంటున్నారు సినీ పరిశీలకులు. ఈ వారం ఎలాగూ కెజిఎఫ్ ని ఢీ కొట్టే సినిమాలు ఇటు సౌత్ లో కూడా ఏం లేవు. సో ..కెజిఎఫ్ కలెక్షన్ల కుమ్ముడు ఇంకో వారం రోజుల పాటు ఇలాగే కంటిన్యూ అవుతుందని అంచన వేస్తున్నారు సినీ వర్గాలు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this