Wednesday, July 16, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Hair Care Tips: ఆవు నెయ్యితో చుండ్రుకు...

NCTE teacher training రెగ్యులేషన్స్ పునఃపరిశీలనలో – NEP 2020 అమలు కీలక నిర్ణయాలు

NCTE teacher training లో పెద్ద మార్పులు రాబోతున్నాయి! నేషనల్ కౌన్సిల్...

IAS, IPS Success Story : ఢిల్లీ యూనివర్సిటీ – UPSC టాపర్స్ రహస్యం

IAS, IPS అధికారి కావాలన్న కల మీదేనా? ఢిల్లీ యూనివర్సిటీని "IAS...

Hair Care Tips: ఆవు నెయ్యితో చుండ్రుకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Cow Ghee on Hair: ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవు నెయ్యి నిత్యం తీసుకోవడం వల్ల ఆహారపు రుచిని పెంపొందించడంతోపాటు శరీరానికి పోషకాలు అందుతాయి. 

Hair Care Tips: ఆవు నెయ్యితో చుండ్రుకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా.

ఆవు నెయ్యి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఆవు నెయ్యి(Cow Ghee) నిత్యం తీసుకోవడం వల్ల ఆహారపు రుచిని పెంపొందించడంతోపాటు శరీరానికి పోషకాలు అందుతాయి. ఆవు నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో, జుట్టుకు కూడా అంతే మేలు చేస్తుంది. దీన్ని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టుకు పోషణ పెంచుతుంది. జుట్టు సమస్యలను కూడా దూరం చేస్తుంది. నెయ్యిలో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి స్కాల్ప్‌ను బ్యాక్టీరియా, ఫంగస్ నుంచి రక్షిస్తుంది. నెయ్యిని ఉపయోగించడం ద్వారా అనేక జుట్టు సమస్యలను అధిగమించవచ్చు. నెయ్యి జుట్టుకు రాసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఓసారి తెలుసుకుందాం.

చుండ్రుకు చెక్ పెట్టండి: జుట్టుకు ఆవు నెయ్యి ఉపయోగించడం ద్వారా చుండ్రుకు చికిత్స చేయవచ్చు. నెయ్యి మలాసెజియా ఫర్ఫర్ అనే ఫంగస్ వృద్ధిని అడ్డుకుంటుంది. మలాసెజియా ఫర్ఫర్ ఫంగస్ చుండ్రు.. ప్రధాన కారణాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. నెయ్యిలో బ్యాక్టీరియా, ఫంగస్‌తో పోరాడే గుణాలు ఉన్నాయి.  చుండ్రు నుంచి ఆవు నెయ్యి రక్షిస్తుంది.

జుట్టును మృదువుగా మార్చుతుంది: నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు మృదువుగా.. ఆరోగ్యంగా మారుతుంది. ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే నెయ్యి జుట్టుకు పోషణను అందించడంతో పాటు జుట్టులో తేమను రక్షిస్తుంది.

జుట్టు రాలడాన్ని నివారిస్తుంది: జుట్టులో పోషకాహార లోపం వల్ల జుట్టు రాలడం మొదలవుతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి నెయ్యి చాలా ప్రభావవంతంగా ఉంటుంది. నెయ్యిలో ఉండే పోషకాలు జుట్టు మూలాలను బలోపేతం చేస్తాయి. జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

గ్రే హెయిర్‌ను నియంత్రిస్తుంది: సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల జుట్టు మీద కూడా ప్రభావం కనిపిస్తుంది. సమయం కంటే ముందే జుట్టు తెల్లబడటం ఈ మధ్య సహజంగా మారుతుంది. పోషకాహార లోపం వల్ల జుట్టు రాలిపోతుంది. మీరు నెరిసిన జుట్టుతో ఇబ్బంది పడుతుంటే.. నెయ్యి జుట్టుకు రక్షణగా నిలుస్తుంది. నెయ్యి రాసుకోవడం వల్ల వెంట్రుకల వేర్లు దృఢంగా మారడంతోపాటు జుట్టు నెరిసిపోవడం ఆగిపోతుంది.

జుట్టు పొడిబారడాన్ని తొలగిస్తుంది: నెయ్యిని జుట్టుకు ఉపయోగించడం వల్ల జుట్టు పొడిబారడం తొలగిపోయి. జుట్టును సులభంగా విడదీస్తుంది. నెయ్యి జుట్టులోని తేమను లాక్ చేస్తుంది. జుట్టు పొడిని తొలగిస్తుంది.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

hair care tips: ఆవు నెయ్యితో చుండ్రుకు చెక్ పెట్టండి.. ఎలానో తెలుసా.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this