BSNL Prepaid Plans : బీఎస్ఎన్ఎల్ సూపర్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

BSNL Prepaid Plans : బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్లు – రోజుకు 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ – చౌక ధరకే – మరిన్ని కూడా

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

BSNL Prepaid Plans : ఎక్కువ డేటా, వ్యాలిడిటీ కావాలనుకునే వారికి బీఎస్ఎన్ఎల్ కొన్ని ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. మంచి బెనిఫిట్స్‌తో పాటు ఇవి అందుబాటులో ఉన్నాయి. వాటిలో కొన్నింటి వివరాలివే.

BSNL Prepaid Plans : బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్లు – రోజుకు 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్

ప్రభుత్వ టెలికం ఆపరేటర్ భారత్‌ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) కొన్ని ఆకర్షణీయమైన ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. ప్రైవేటు టెలికం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరకే.. ఎక్కువ ప్రయోజనాలను ఇస్తోంది. ముఖ్యంగా కొన్ని ప్లాన్‌లతో అధిక వ్యాలిడిటీతో పాటు ఎక్కువ డేటాను BSNL అందిస్తోంది. ఎక్కువగా డేటా వాడే వారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఇలా BSNL ఇస్తున్న కొన్ని బెస్ట్ ప్లాన్‌లు ఇవే.

BSNL రూ.599 ప్లాన్‌

రోజులో ఎక్కువ డేటా కావాలనుకునే వారికి ఈ ప్లాన్‌ సూటవుతుంది. బీఎస్ఎన్ఎల్ రూ.599 ప్రీపెయిడ్ ప్లాన్‌ (STV_WFH_599) తో రీచార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 5జీబీ డేటా లభిస్తుంది. అంటే మొత్తంగా 420జీబీ డేటా పొందవచ్చు. అలాగే ఈ ప్లాన్‌తో అన్‌లిమిడెట్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు కూడా దక్కుతాయి. దీంతోపాటు వేలాది పాటలు, సినిమాలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ ఉండే జింగ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉచితంగా లభిస్తుంది. ఇక అర్థరాత్రి 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు హైస్పీడ్ డేటా అయినా యూజర్లు వాడుకోవచ్చు. ముఖ్యంగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వారిని దృష్టిలో ఉంచుకొని BSNL ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.

BSNL రూ.499 ప్లాన్‌

మరోవైపు BSNL రూ.499 (STV_499) ప్లాన్‌ కూడా మంచి ప్రయోజనాలను ఇస్తోంది. ఈ ప్లాన్‌ తీసుకుంటే 90 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు వినియోగించుకోవచ్చు. అయితే ఈ ప్లాన్‌తో ఏ ఓటీటీ సబ్‌స్క్రిప్షన్ లభించదు.

BSNL రూ.447 ప్లాన్‌

ఎలాంటి రోజువారి లిమిట్ లేకుండా ఒకేసారి ఎక్కువ డేటా కావాలనుకునే వారికి BSNL రూ.447 ప్లాన్‌ (STV_447) అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఒకేసారి 100జీబీ డేటా లభిస్తుంది. వ్యాలిడిటీ 60 రోజులు. 100జీబీ డేటా అయిపోయాక 80కేబీపీఎస్ స్పీడ్‌తో ఇంటర్నెట్ వాడుకోవచ్చు. డేటా వౌచర్‌ విభాగంలో కింద ఈ ప్లాన్‌ లిస్టయింది. అయినా ఈ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్‌లు కూడా దక్కుతాయి. బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్‌తో పాటు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఎరోస్ నౌ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది.

డేటా, సుదీర్ఘ వ్యాలిడిటీ కోసం.. రూ.1498 ప్లాన్‌

కేవలం డేటాతో పాటు ఎక్కువ రోజులు వ్యాలిడిటీ ప్లాన్‌ కావాలనుకునే వారికి BSNL రూ.1498 ప్లాన్‌ సూటవుతుంది. ఈ ప్లాన్‌తో రీచార్జ్ చేసుకుంటే ఏకంగా సంవత్సరం పాటు అంటే 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జీబీ డేటా దక్కుతుంది. అయితే కాల్స్, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు ఉండవు.
అయితే ప్రస్తుతం BSNL 3జీ సేవలను మాత్రమే అందిస్తోంది. ఆగస్టులో 4జీ నెట్‌వర్క్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
bsnl prepaid plans : బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్లు - రోజుకు 5జీబీ డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్ - చౌక ధరకే - మరిన్ని కూడా


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this