Beauty secrets: నిత్య యవ్వనంగా కనిపించాలా? అయితే...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Beauty secrets: నిత్య యవ్వనంగా కనిపించాలా? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎండాకాలం వచ్చేసింది. చెమటలు, ఎండకు ముఖంలో తేజస్సు కోల్పోవడం జరుగుతుంది. అయితే యంగ్ (young)​గా కనిపించాలంటే ఒక్కరోజులో అయ్యే పనికాదు. వారి రోజు వారివారి అలవాట్లే వారిని అలా తీర్చిదిద్దుతాయి.

Beauty secrets: నిత్య యవ్వనంగా కనిపించాలా? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

ఎండాకాలం వచ్చేసింది.చెమటలు, ఎండకు ముఖంలో తేజస్సు కోల్పోవడం జరుగుతుంది. ముఖంలో యవ్వనాన్ని(Young look) కోల్పోకూడదని చాలా మంది భావిస్తారు. ఒక చిన్న తెల్ల వెంట్రుక కనబడితే చాలు అరవై ఏళ్లు వయస్సు ఉన్నట్లు చాలా మంది భావిస్తారు. యవ్వనం(young)గా కనబడేందుకు అనేక మార్గాలను అందిస్తున్నారు. మీరు యవ్వనంగా ఉండాలంటే మీ ముఖం (face) మీద ఉన్న ముడతలను వదిలించుకోవాలి. ఆ తర్వాత యవ్వనం మీ సొంతమవుతుంది.

అయితే కొన్ని చిట్కాలు (young looking tips) పాటిస్తే మన ముఖాన్ని(face) తిరిగి నిగనిగలాడించేయొచ్చు. అందులో ఫేస్​ ప్యాక్​లు, మసాజ్​(massage)లు లాంటివి ఉన్నాయి.

ముఖానికి మసాజ్ చేస్తే అందంగా ఉంటుంది. వలయాకారంలో, పై నుంచి కిందకు మసాజ్‌ చేయాలి. ఇలా చేయడం వల్ల చర్మాని (skin)కి రక్తప్రసరణ పెరుగుతుంది. తద్వారా చర్మం యవ్వనంగా (young) మారి…. వయస్సుతో పాటు ఏర్పడే ముడతలు తగ్గిపోతాయి.

మసాజ్‌ చేయడం అంటే ముఖం (face) మీది మలినాలు తొలగించడమే. స్క్రబ్బింగ్‌ చేసేటప్పుడు నెమ్మదిగా మసాజ్‌ చేయాలి. దాంతో మృతకణాలు, మురికి, నల్లమచ్చల నుంచి ఉపశమనం కలుగుతోంది.

మొటిమలు బాధిస్తున్నట్లయితే ఆరెంజ్‌ ప్యాక్‌ (Orange pack) వాడాలి. ఒక ఆరెంజ్‌, ఒక టీస్పూన్‌ పుదీనా, కొంచెం లెమన్‌ జ్యూస్‌ కలిపి గుజ్జులా చేసుకుని ముఖానికి పట్టించాలి. అరగంట తరువాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఆరెంజ్‌లో విటమిన్‌ ‘సి’ పుష్కలం,. యాంటీ ఆక్సిడెంట్లు, జింక్‌ మొటిమలను నిరోధించడంలో తోడ్పడతాయి.

జిడ్డు చర్మం (Oily skin) ఉన్నవారికి మొటిమల (Pimples) సమస్య ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ రకం చర్మం ఉన్నవారు సిట్రస్‌ ఫేస్‌ వాష్‌, ప్యాక్స్‌ ఎక్కువ వాడాలి. అందుకే ఈ రకం చర్మం ఉన్నవారు సిట్రస్‌ ఫేస్‌ వాష్‌, ప్యాక్స్‌ ఎక్కువ వాడాలి. మొటిమల సమస్యతో టీనేజర్లు ఎక్కవగా బాధపడుతుంటారు. సాధారణ చర్మం వారికి  అన్ని రకాల ప్యాక్స్‌ పడవు.

తేనె (Honey) కాంబినేషన్స్‌తో కూడిన ప్యాక్స్‌ మాత్రమే సరిపోతాయి. అలాగే,  సబ్బుతో కాకుండా మైల్డ్‌ ఫేస్‌వాష్‌తో ముఖం కడుక్కోవాలి.  పొడిచర్మం ఉన్నవారు మాయిశ్చరైజర్‌ ఉన్న క్రీమ్స్‌, ప్యాక్స్‌ వేసుకోవడం మంచిది.

పాలతో మిక్స్‌ చేసే ప్యాక్స్‌ వేసుకోవచ్చు. అలాగే ముల్తానీ మట్టి, శనగపిండి అప్పుడప్పుడు వాడొచ్చు. అలాగే నిమ్మ, ఆరెంజ్‌లాంటివి వాడొద్దు. వీటిని వాడితే చర్మం మరింతగా పొడిబారి పోతుంది. కలబంద వాడితే మంచి ఫలితం ఉంటుంది.

ఫేస్‌ప్యాక్‌ (face pack) ఏదైనా ఫరవాలేదు, సరిపోతుంది అనుకుంటే పొరపాటే. మీది ఎలాంటి చర్మ (skin)మో తెలుసుకుని దానికి నప్పే ప్యాక్‌ను ఉపయోగించినప్పుడే ఫలితం ఉంటుంది. సాధారణ చర్మం అయితే ఆపిల్‌ ప్యాక్‌ (apple pack) వాడొచ్చు.

ఆపిల్‌ (apple)ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని తరువాత గుజ్జు మాదిరిగా చేసుకోవాలి. దీనికి తేనె కలిపి 15 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టాలి. ఈ మిశ్రమాన్ని నిదానంగా మసాజ్‌ చేస్తున్నట్టుగా ముఖంపై అప్లై చేయాలి.

అరగంట తరువాత శుభ్రంగా నీటితో కడుక్కోవాలి. ఆపిల్‌లో విటమిన్‌ ఎ, బి, సి ఉంటాయి. ఫెనాల్స్‌ అనే యాంటీ ఆక్సిడెంట్‌ లభిస్తుంది. ఇవన్నీ సాధారణ చర్మానికి నిగారింపు వచ్చేలా చేస్తాయి.

beauty secrets: నిత్య యవ్వనంగా కనిపించాలా? అయితే మీ ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోండి..

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this