Andhra News: సీపీఎస్‌ రద్దుపై జాయింట్‌ స్టాఫ్‌...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Andhra News: సీపీఎస్‌ రద్దుపై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Andhra News: సీపీఎస్‌ రద్దుపై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు

అమరావతి: కంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌ (సీపీఎస్) అంశంపై చర్చించేందుకు సచివాలయంలో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌, ఉన్నతాధికారులు, రెవెన్యూ సర్వీసెస్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశంలో పాల్గొన్నారు. సీపీఎస్‌ రద్దు అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చిస్తున్నారు.
సీపీఎస్‌ రద్దుపై తొలిసారి భేటీ జరుగుతున్న నేపథ్యంలో సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా పీఆర్‌సీపై పెండింగ్‌లో ఉన్న జీవోలనూ విడుదల చేయాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నట్లు సమాచారం. పెండింగ్‌ అంశాలు వెంటనే పరిష్కరించాలని.. సీపీఎస్‌ రద్దు చేస్తేనే అంగీకారమని ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీపీఎస్‌ రద్దు చేయాలని ప్రభుత్వాన్ని గట్టిగా కోరనున్నట్లు చెప్పారు. రద్దు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలేవీ అంగీకరించబోయేది లేదని ఉద్యోగ సంఘాల నేతలు తేల్చి చెప్పారు.

andhra news: సీపీఎస్‌ రద్దుపై జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ భేటీ.. హాజరైన ఉద్యోగ సంఘాల నేతలు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this