Wednesday, June 11, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Corona Vaccination Guidelines : 12 -14...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

Corona Vaccination Guidelines : 12 -14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Children Vaccination Guidelines : 12 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు పిల్లలందరికీ కార్బెవ్యాక్స్(Carbevax) టీకా మాత్రమే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. 

Children Vaccination Guidelines

దేశవ్యాప్తంగా బుధవారం(రేపు) నుంచి 12-14 ఏళ్ల మధ్య వయసు పిల్లలకు కరోనా వ్యాక్సినేషన్(Vaccination)​ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం ఇప్పటికే వెల్లడించింది. ఆ మార్గదర్శకాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… కార్బెవ్యాక్స్ మొదటి డోసు తీసుకున్న తర్వాత రెండో డోసుకు 28 రోజుల వ్యవధి ఉండాలి. 2010 తర్వాత జన్మించి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న పిల్లలందరూ కొవిన్ పోర్టల్(Covin)​లో టీకా కోసం ​రిజిస్టర్​ చేసుకోవాలి. 12 ఏళ్లు దాటిన వారికే వ్యాక్సిన్​ వేస్తున్నట్లు టీకా వేసేవారు నిర్ధరించుకోవాలి. కొవిన్ పోర్టల్​లో రిజిస్టర్ చేసుకున్నప్పటికీ వయసు 12 ఏళ్లు పూర్తి కాని పిల్లలకు టీకా వేయకూడదు. కొవిన్​లో ఖాతా ఉన్న తల్లిదండ్రులు తమ పిల్లలకు టీకా కోసం అందులోనే రిజిస్టర్​ చేసుకోవచ్చు. లేదా టీకా కేంద్రాలకు వెళ్లి నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పిల్లలకు ఇతర టీకాలు ఇచ్చే అవకాశం తలెత్తకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Children Vaccination Guidelines

14-15 ఏళ్ల వయసు పిల్లలందరికీ ఇప్పటికే టీకాలు వేస్తున్నారు. వీరంతా కొవాగ్జిన్ తీసుకుంటున్నారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం దేశంలో 2021 మార్చి 1 నాటికి 12-13 ఏళ్ల వయసు చిన్నారులు 4.7 కోట్ల మంది ఉన్నారు. అలాగే 60 ఏళ్లు దాటిన వారందరూ మార్చి 16 నుంచి బూస్టర్ డోసు తీసుకునేందుకు అర్హులు. రెండో డోసు తీసుకున్న 9 నెలల తర్వాతే మూడో డోసు తీసుకోవాలి. మొదటి రెండు డోసులు ఏ కంపెనీ టీకా తీసుకుంటే దాన్నే కొనసాగించాలి.

corona vaccination guidelines : 12 -14 ఏళ్ల పిల్లలకు కరోనా టీకా వేయిస్తున్నారా.. అయితే ఈ జాగ్రత్తలు మీ కోసమే

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this