Science Facts: ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది?...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Science Facts: ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? కారణం మీకు తెలిసింది మాత్రం కాదు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Science Facts :  సాధారణంగా మనం మన ప్రకృతి(Nature)లో ఉండే ఎన్నో వింతలను చూస్తుంటాం. ముఖ్యంగా ఎన్నో ఆసక్తికర జంతువులను చూస్తాం. చిన్నప్పటి నుంచి మనలను కొన్ని జీవరాశులు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాయి. 

అదేవిధంగా వాటిగురించి మనం వినే విషయాలు కూడా ఎప్పుడూ మనల్ని అబ్బుర పరుస్తూనే ఉంటాయి. అయితే, జీవరాశుల విషయంలో మనం వినే అన్ని విషయాలు నిజాలు(Facts) కాదు అని తెలిసినపుడు అవునా! అని అనిపిస్తుంది. చిన్నప్పుడు మనం విన్న విషయాలు పెద్దయ్యాకా మనం మన పిల్లలకూ చెబుతాం. 

అదేవిధంగా తరతరాలుగా జరుగుతూ వస్తోంది. దీంతో ఆ జీవరాశుల గురించి మనకు శాస్త్రీయం(Scientific)గా వివరంగా తెలిసినా అవి మనకు నమ్మలేని నిజాలుగా అనిపిస్తాయి. అటువంటి మూడు అబ్బురపరిచే విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది?

ఈ ప్రశ్నకు జవాబు మీకు తెలుసా? కచ్చితంగా తెలుసనే అంటారనే విషయం మాకు తెలుసు. కానీ, మీరేమని చెబుదామని అనుకుంటున్నారో అది మాత్రం నిజం కాదు. 

ఊసరవెల్లి రంగులు మార్చడానికి కారణం అది శత్రువుల నుంచి తప్పించుకోవడానికి అని మీరు అనుకుంటున్నారు.. అదే మీరు ఇప్పటివరకూ వింటూ వస్తున్నారు. అయితే, ఇది నిజం కాదు. అవును.. అవి వివిధ కారణాలతో అవి రంగులు మారుస్తాయి. 

నిజానికి, ఊసరవెల్లులు తమ శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుకోవడానికి .. ఇతర ఊసరవెల్లిలకు సంకేతాలు ఇవ్వడానికి తమ శరీర రంగును మారుస్తాయి. అవి ఒకదానితో ఒకటి సంభాషించడానికి .. శక్తిని చూపించడానికి ప్రకాశవంతమైన రంగులను వెలువరుస్తాయి. 

ఇతర ఊసరవెల్లిలతో పోరాటంలో, ఊసరవెల్లులు ముదురు రంగును సంతరించుకుంటాయి. ఊసరవెల్లిల మరొక లక్షణం వాటి కళ్ళు. ఊసరవెల్లులు ఏకకాలంలో వివిధ దిశల్లో చూడగలవు.

 అవి తప్ప మరే ఇతర సరీసృపాలకు లేని లక్షణం ఇది. అయితే, బల్లుల వలె కాకుండా, ఊసరవెల్లి తోక ఒకసారి తెగిపోతే తిరిగి పెరగదు.

గోల్డ్ ఫిష్ కి మతిమరుపు..

ఇది మనకు చిన్నప్పటి నుంచి తెలిసిన విషయం కానీ.. ఇది పూర్తిగా తప్పు. ఎందుకంటే, గోల్డ్ ఫిష్ కి మనకంటే ఎక్కువ జ్ఞాపక శక్తి ఉంటుంది. ఒకసారి అది చూసిన విషయాన్ని 5 నుంచి 6 నెలల పాటు గుర్తుంచుకుంటుంది. 

అదేవిధంగా దానికి సమయ భావం .. స్థిరమైన దినచర్య ఉంటుంది. మూసి ఉన్న అక్వేరియంలలో నివసించే గోల్డ్ ఫిష్ తమ ఫుడ్ బాక్స్‌ని చూడగానే రెచ్చిపోవడం కనిపిస్తుంది. చుట్టుపక్కల అవి తమ యజమానిని చూస్తే, ఉత్సాహంతో నీటిలో నుంచి దూకడానికి కూడా ప్రయత్నిస్తాయి. అలాగే, గోల్డ్ ఫిష్ జీవిత కాలం కూడా ఎక్కువ. 

‘టిష్’ అనే చేప పేరు గిన్నిస్ బుక్‌లో పురాతన గోల్డ్ ఫిష్‌గా నమోదైంది, దీని వయస్సు 43 సంవత్సరాలు. ప్రజలు తమ ఇళ్లలోని ఫెంగ్ షుయ్ అక్వేరియంలో గోల్డ్ ఫిష్‌లను ఉంచడానికి ఇష్టపడతారు, ఎందుకంటే చైనాలోని ఫెంగ్ షుయ్ గ్రంథంలో వాటిని పవిత్రమైనవిగా భావిస్తారు.

 గోల్డ్ ఫిష్‌లను కూడా గుడ్‌లక్‌గా పరిగణిస్తారు. దక్షిణ ఐరోపాలో, మొదటి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, భర్తలు తమ భార్యకు గోల్డ్ ఫిష్‌ను బహుమతిగా ఇస్తారు.

గబ్బిలాలు చూడలేవు!

ఇదొక పెద్ద అపోహ మనకు. గబ్బిలం కళ్ళు కనిపించవనీ.. అవి గుడ్డివనీ పెద్ద నమ్మకం అందరికీ. కానీ..ఇది పూర్తిగా తప్పు. గబ్బిలాలు గుడ్డివి కావు, కానీ వాటి కళ్ళు చాలా చిన్నవి. వాటి కంటి చూపు బలహీనంగా ఉండటంతో వాటిని అంధులుగా భావించారు. అవి రాత్రి చీకటిలో మాత్రమే వేటాడేందుకు ఇష్టపడతాయి. కానీ మనుషులకు చీకటి తప్ప మరేమీ కనిపించని చీకటిలో గబ్బిలాలు తమ చిన్న కళ్లతో హాయిగా చూడగలవు. అలాగే, గబ్బిలాలకు వినికిడి సామర్థ్యం కూడా చాలా ఎక్కువ.
ఇంకా గబ్బిలాలు రక్తాన్ని పీల్చుకుంటాయనే విషయం కూడా బాగా ప్రాచుర్యంలో ఉంది. నిజం ఏమిటంటే చాలా జాతుల గబ్బిలాలు కీటకాలు, పండ్లు లేదా పుప్పొడిని తింటాయి. వీటిలో మూడు జాతులు మాత్రమే ఉన్నాయి. అవి మాత్రమే రక్తాన్ని పీల్చుకుంటాయి. అవి ఎక్కువ అమెరికాలో కనిపిస్తాయి. అవి మానవ రక్తాన్ని తాగడం చాలా అరుదుగా కనిపిస్తుంది. అవి ఎక్కువగా ఇతర పక్షుల రక్తాన్ని పీల్చుకుంటాయి.
science facts: ఊసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? కారణం మీకు తెలిసింది మాత్రం కాదు!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this