PRC Issue : ఏకతాటిపైకి ఉద్యోగ...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

PRC Issue : ఏకతాటిపైకి ఉద్యోగ సంఘాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • పీఆర్సీ ఉత్తర్వులపై పోరాడాలని నిర్ణయం
  • సచివాలయంలో నాలుగు సంఘాల ప్రతినిధుల సమావేశం నేడు

పీఆర్సీ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పోరాడేందుకు ఉద్యోగ సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఇప్పటికే ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదికగా ఉండగా… వీటితో ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘాలు కలిశాయి. నాలుగు సంఘాల ప్రతినిధులు గురువారం విజయవాడలోని ఓ హోటల్‌లో ప్రత్యేకంగా సమావేశమై ఉద్యమ కార్యాచరణపై చర్చించారు. శుక్రవారం సచివాలయంలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను నిర్ణయించాలని ఏకాభిప్రాయానికి వచ్చారు.

కలిసి పోరాడి ఒత్తిడి పెంచుతాం

-ఏపీ ఐకాస ఛైర్మన్‌ బండి శ్రీనివాసరావు

ఏపీ ఐకాస, ఐకాస అమరావతి ఐక్యవేదికలో ఉద్యమంపై సంయుక్తంగా చర్చించాం. అన్ని సంఘాలు ఒకే తాటిపైకి రావాలనే నిర్ణయానికి వచ్చాం. కలిసి పోరాడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతాం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి 21న సమ్మె నోటీసు ఇవ్వాలని ఏపీ ఐకాసలో నిర్ణయం తీసుకున్నాం. ఉద్యోగుల కోసం అందరం కలిసి పని చేయాలనే అభిప్రాయంతో నాలుగు సంఘాల నాయకులం ఒకే అంగీకారానికి వచ్చాం.

ప్రభుత్వ అనుమతి అవసరం లేదు

-ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు

సచివాలయంలో శుక్రవారం నిర్వహించనున్న సమావేశానికి ప్రభుత్వం నుంచి అనుమతి అవసరం లేదు. డిమాండ్ల సాధనకు కోసమే పోరాడుతున్నాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమే. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమ్మె నోటీసు ఎప్పుడు ఇవ్వాలనే దానిపై సచివాలయంలో జరిగే సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం.

ఇకపై అందరిదీ ఒకే డిమాండ్‌

-ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ

పీఆర్సీ విషయంలో ప్రభుత్వం అంకెల గారడీ చేసింది. ఉత్తర్వుల ప్రభావం ఉద్యోగులు, పింఛన్‌దారులపై జీతాలపై అయిదేళ్లపాటు ఉంటుంది. అందుకే ఉపాధ్యాయులు ఉవ్వెత్తున ఆందోళనకు దిగారు.

ఉమ్మడిగా ముందుకు వెళ్తాం

-సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి

పీఆర్సీ అందరి సమస్య. అందుకే ఉమ్మడిగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నాం. ఇప్పటివరకు సంఘాల సభ్యులు, సంఘ ప్రయోజనాల కోసం పనిచేశాం. పీఆర్సీతో ఉద్యోగులందరికీ నష్టం జరుగుతున్నందున ఒకే మాటగా మెరుగైన పీఆర్సీ సాధనకు పని చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

‘సీఎంతో అయితేనే చర్చలకు వెళతాం’

‘పీఆర్సీ జీవోలపై నేరుగా ముఖ్యమంత్రితో అయితేనే చర్చలకు వెళతాం. అధికారులతో అంటే వెళ్లబోం. ఇప్పటివరకైతే చర్చలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారమూ లేదు’ అని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పష్టంచేశారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణతో కలిసి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి వచ్చారు. బయటికి వచ్చాక విలేకరులతో మాట్లాడుతూ…  ‘సీఎంఓలో ఎవరినీ కలవలేదు, మాకు సంబంధించిన ఫైల్‌ ఏదో ఉంటే దాని కోసం వెళ్లాం’ అని సూర్యనారాయణ చెప్పారు. అన్ని ఉద్యోగ సంఘాలతో కలిసి పీఆర్సీపై పోరాడాలన్న నిర్ణయానికి వచ్చినట్లు వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ తెలిపారు.

prc issue :  ఏకతాటిపైకి ఉద్యోగ   సంఘాలు

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this