Viral News: వామ్మో.. ఇదేం పిచ్చి! మాజీ...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Viral News: వామ్మో.. ఇదేం పిచ్చి! మాజీ ప్రియుడి కోసం ప్రియురాలు ఎంత పని చేసింది.. చివరికి.!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Viral News: ఈ మధ్యకాలంలో యువత చిన్న చిన్న విషయాలకే తమ ప్రేమ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు. ఇలా విడిపోయిన కొన్నాళ్లకు మాజీ ప్రేమికుడు/ప్రేమికురాలిని మర్చిపోలేక విరహవేదనను అనుభవిస్తున్నారు. కొంతమంది అయితే వారి దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. బ్రిటన్‌లో ఇలాంటి ఉదంతం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతి తన మాజీ ప్రేమికుడికి దగ్గరయ్యేందుకు ఎవరూ ఊహించనటువంటి పని చేసింది. మొదటిగా మీరు ఆమె చెప్పిన కథ విన్నప్పుడు.. ఎమోషనల్‌గా ఫీల్ అవుతారు.. కానీ ఆమె మూర్ఖత్వానికి జాలిపడతారు. అసలు ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..

బ్రిటన్‌కు చెందిన ఓ అమ్మాయి తన ప్రేమగాధను టిక్ టాక్‌లో ఓ వీడియో ద్వారా నెటిజన్లతో పంచుకుంది. ఆ అమ్మాయి బ్రేకప్ తర్వాత తన మాజీ బాయ్‌ఫ్రెండ్ దృష్టిని ఆకర్షించేందుకు పెళ్లి చేసుకున్నట్లు అందులో పేర్కొంది. ఇక్కడ తమాషా ఏంటంటే.. ఈ పెళ్లి కోసం లక్షలు ఖర్చు పెట్టిందట. అదేంటని అనుకుంటున్నారా.. అక్కడ పెళ్లి ఏమి జరగలేదండీ.. కేవలం తనకు పెళ్లి జరిగినట్లుగా ఆ యువతి ఓ ఫేక్ మ్యారేజ్‌ను సృష్టించింది.. కొన్ని మ్యారేజ్ ఫోటోలను ఫోటోషాప్ సాయంతో మార్ఫ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక ఆ ఫోటోలు చూస్తే.. ఎవ్వరైనా కూడా ఇట్టే మోసపోతారు.

ఈ ఫేక్ మ్యారేజ్ గురించి తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌కి తెలియజేసేందుకు.. ఆ యువతి ఓ విలాసవంతమైన పార్టీని కూడా ఏర్పాటు చేసింది. ఇందుకోసం ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్లను సైతం నియమించింది. ఆ పార్టీలో తనకు భర్తగా నటించేందుకు ఓ యాక్టర్‌కు బోలెడంత డబ్బు ఇచ్చింది. తద్వారా తన మాజీ ప్రియుడి దృష్టిని ఆకర్షించగలిగానని చెప్పుకొచ్చింది. ఇక ఈ స్టోరీ విన్నాక నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేశారు.

ఇదంతా చేయడం వల్ల.. ఆమెకు లాభం ఏమైనా జరిగిందా.? ఈ విలాసవంతమైన పార్టీకి ఆమె మాజీ ప్రియుడు విచ్చేశాడా.? అంటూ అడిగారు. అయితే అక్కడ ఇలాంటిది ఏమి జరగలేదు. ఆమె పెళ్లి ఫోటోలను చూసిన మాజీ ప్రియుడు.. కనీసం ఆ యువతికి రిప్లై కూడా ఇవ్వలేదట. ఈ విషయాన్ని చెప్పుకుని ఆమె బాధపడింది. కాగా, ఈ టిక్‌టాక్ వీడియోకు లక్షల్లో వ్యూస్, కామెంట్స్ వచ్చి పడుతున్నాయి. ‘ఎవరైనా పెళ్లయ్యాక.. మళ్లీ మీ దగ్గరకు వస్తారా’ అంటూ ఒకరు కామెంట్ చేయగా.. చాలామంది ఈమె కథకు బాగా ఎమోషనల్‌గా కనెక్ట్ అయ్యారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this