Wednesday, June 11, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
South Africa: ఆదేశంలో భారీగా కరోనా ఒమిక్రాన్...

AP Teacher Transfers 2025 FAQs

AP Teacher Transfers 2025 FAQs మరియు వాటి సమాధానాలు ఇక్కడ...

Teacher Transfers 2025: ఆంధ్రప్రదేశ్‌లో విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు!

ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో టీచర్ల బదిలీలకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన...

విద్యారంగంలో నవశకం: Andhra Pradesh Teacher Transfers 2025 – ఉపాధ్యాయులకు గొప్ప ఊరట!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. 2025...

iQOO Neo 10: 120W ఫాస్ట్ ఛార్జింగ్, 7000mAh బ్యాటరీతో భారత్‌లో లాంఛ్ – ధర, ఫీచర్లు ఇవే!

iQOO Neo 10 భారత్ మార్కెట్‌లో మే 26న లాంఛ్ కానుంది....

South Africa: ఆదేశంలో భారీగా కరోనా ఒమిక్రాన్ కేసులు.. టీకాలు తీసుకోకుంటే ఆ పరిస్థితి తప్పదంటున్న ప్రభుత్వం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

South Africa: దక్షిణాఫ్రికాలో కోవిడ్ -19  కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో తమ దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారు. గత మూడు..

South Africa: దక్షిణాఫ్రికాలో కోవిడ్ -19  కొత్త ఒమిక్రాన్ వేరియంట్ వెలుగులోకి రావడంతో తమ దేశంలో భారీగా కేసులు పెరుగుతున్నాయని ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అన్నారు. గత మూడు వారాలుగా రోజు రోజుకీ కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయని.. ఇది కరోనా ఫోర్త్ వేవ్ వస్తుందేమో అనిపిస్తుందన్నారు. ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల పెరుగుదలతో తమ దేశంలోని ప్రజలు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని.. కరోనా నిబంధనలు పాటించాలని రామఫోసా కోరారు. దక్షిణాఫ్రికా సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు కొత్త ఒమిక్రాన్ వేరియంట్ గురించి.. దానిపై వ్యాక్సిన్ ఏ విధంగా పనిచేస్తుందని తెలుసుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. దేశ ప్రజలు కఠినమైన లాక్‌డౌన్ నిబంధనల కోసం ఎదురుచూడకుండా టీకాలు తీసుకోవాలని, సామూహిక భద్రత, కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని రమాఫోసా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మరికొన్ని రోజుల్లోనే ఈ వేరియంట్‌కు సంబంధించి అదనపు సమాచారం తెలుస్తుందని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు ఆశాభావం వ్యక్తం చేశారు.

రోజు రోజుకీ దేశంలో కేసుల సంఖ్య పెరుగుతోంది.. మరోవైపు ప్రజలు పండుగల సీజన్‌కు సన్నద్ధమవుతున్నందున, ఎక్కువ మందికి టీకాలు తమ ప్రాధాన్యతని చెప్పారు. అంటువ్యాధుల వ్యాప్తిని నిరోధించడానికి టీకాలు వేయడం అత్యంత ప్రభావవంతమైన సాధనమని శాస్త్రీయ ఆధారాలు చూపిస్తున్నాయి. టీకా తీసుకోవడం వలన తీవ్రమైన అనారోగ్యం, ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గిస్తాయని ఆయన చెప్పారు.

దేశంలో గడచిన ఏడు రోజుల్లోనే కొత్త కేసుల సంఖ్య 5 రేట్లు పెరిగాయి. అంతేకాదు 15 రోజుల క్రితం పాజిటివ్ రేటు 2 శాతం ఉండగా.. తాజాగా 25శాతానికి చేరుకొని ఆందోళన కలిగిస్తోంది. ఈ పాజిటివ్ రేటు మరింతగా పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో దేశ ప్రజలను అప్రమత్తం చేస్తూ దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రామఫోసా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. కరోనా నివారణ ఆంక్షలను మరింత కఠినతరం చేసే అంశంపై  జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన నేషనల్‌ కరోనావైరస్‌ కమాండ్‌ కౌన్సిల్‌ త్వరలోనే సమావేశమవుతుందని చెప్పారు.

south africa: ఆదేశంలో భారీగా కరోనా ఒమిక్రాన్ కేసులు.. టీకాలు తీసుకోకుంటే ఆ పరిస్థితి తప్పదంటున్న ప్రభుత్వం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this