PRC News: త్వరలోనే PRC పై తుది...

Talliki Vandanam (తల్లికి వందనం) Attendance Check – ఇప్పుడు మొబైల్ లోనే మీ పిల్లల హాజరు శాతం తెలుసుకోండి!

ప్రియమైన తల్లిదండ్రులారా, మీ పిల్లల Talliki Vandanam Attendance Percentage ఎంత...

How to Know Thalliki Vandanam Eligibility Status | తల్లికి వందనం ఏలిజిబిలిటీ స్టేటస్

తల్లికి వందనం పథకం 2026-27 – అర్హత స్థితి తనిఖీ విధానం2026-27...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

PRC News: త్వరలోనే PRC పై తుది రూపు ఇస్తాం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

• రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని PRC ఉంటుంది
• నిన్నటి చర్చల సారాంశం, ఉద్యోగుల డిమాండ్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం
• భారీ అంచనాలు అయితే లేదు కానీ ఉద్యోగులకు నష్టం లేకుండా చూస్తాం
• కరోనా వల్ల ఆర్థికపరిస్థితి దెబ్బతినకుంటే బాగానే ఉండేది
• సీఎం గారు ఉద్యోగులకు మేలు చేయాలనే మనస్తత్వంతో ఉన్నారు
• త్వరలోనే చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వస్తాం
• ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెల్లడి

తాడేపల్లిలోని సీఎం గారి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారిని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ గారు, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు నేడు కలిశారు. PRC పై బుధవారం ఉద్యోగులతో జరిగిన చర్చల వివరాలను ఈ సందర్భంగా సీఎం గారికి వివరించారు.

అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మీడియాతో మాట్లాడుతూ.. ‘నిన్నటి చర్చల సారాంశం, ఉద్యోగుల డిమాండ్స్ సీఎం గారి దృష్టికి తీసుకెళ్లాం. ఫిట్‌మెంటుతో పాటు ఇతర విషయాలపై సీఎం గారితో చర్చించాము. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని PRC ఉంటుంది. ఉద్యోగులు కూడా సహకరించాలని కోరాము. భారీ అంచనాలు అయితే లేదు కానీ ఉద్యోగులకు నష్టం లేకుండా చూస్తాం. కరోనా వల్ల ఆర్థికపరిస్థితి దెబ్బతినకుంటే బాగానే ఉండేది. గతంతో ఇతర రాష్ట్రాలతో పోల్చుకునే పరిస్థితి లేదు. త్వరలోనే ఈ అంశానికి తుది రూపు ఇస్తాం. ఉద్యోగుల ఆందోళన కూడా వాయిదా వేసుకోమని కోరాము. ఈ ఉద్యోగ సంఘాలు మరో మారు CS తో భేటీ అయ్యి ఆందోళనపై నిర్ణయం తీసుకుంటారు. సీఎం గారు ఉద్యోగులకు మేలు చేయాలనే మనస్తత్వంతో ఉన్నారు. త్వరలోనే చర్చల అనంతరం ఒక నిర్ణయానికి వస్తాం’ అని అన్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this