PRC News: ఉద్యోగుల PRCపై బిగ్ ట్విస్ట్:...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

PRC News: ఉద్యోగుల PRCపై బిగ్ ట్విస్ట్: సీఎం జగన్ హామీ ఇచ్చిన గంటల్లోనే..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కారు ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. దీంతో పీఆర్‌సీ సహా సంబంధిత అంశాలపై ఉద్యోగ సంఘాలతో కార్యదర్శుల కమిటీ సమావేశం అర్ధంతరంగా ముగిసింది. జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌లో భాగస్వాములైన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సచివాలయం మొదటి బ్లాక్‌‌లోని సీఎం సమావేశ మందిరంలో శుక్రవారం ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పీఆర్‌సీ నివేదిక ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు కోరగా.. నివేదికలోని సాంకేతిక అంశాలపై అధ్యయనం చేయాలని అధికారులు వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో పీఆర్‌సీ నివేదిక ఇవ్వలేమని స్పష్టం చేశారు.

పీఆర్‌సీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో ప్రకటన చేశారని.. సీఎం హామీ మేరకు 10 రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని కార్యదర్శుల కమిటీ తెలిపింది. దీనిపై ఉద్యోగ సంఘాలు ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అసలు పీఆర్‌సీ నివేదిక ఇవ్వకుండా చర్చలు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. దీంతో కార్యదర్శుల కమిటీ సమావేశం అసంపూర్తిగానే ముగిసింది.

ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ… 71 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని మళ్లీ ఇచ్చామని వెల్లడించారు. కార్యదర్శుల కమిటీది కాలయాపన తప్ప మరొకటి కాదని తప్పుపట్టారు. ప్రభుత్వం ఏదో ఒకటి చెప్పే వరకు ఉద్యమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు.

కాగా, శుక్రవారం తిరుపతిలో పర్యటిస్తున్న సీఎం జగన్ పీఆర్‌సీకి సంబంధించి కీలక ప్రకటన చేశారు. సరస్వతి నగర్‌లో సీఎంను కలిసిన ఉద్యోగులు.. పీఆర్‌సీ ప్రకటించాలని కోరారు. దీంతో 10 రోజుల్లో పీఆర్‌సీ ప్రకటిస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. అయితే, తాజా సమావేశంలో పీఆర్‌సీ నివేదిక ఇవ్వకపోవడంతో మరోసారి దీనిపై సందిగ్ధత కొనసాగుతోంది.

prc news: ఉద్యోగుల prcపై బిగ్ ట్విస్ట్: సీఎం జగన్ హామీ ఇచ్చిన గంటల్లోనే..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this