Postal Scheme: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో చేరితే...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Postal Scheme: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో చేరితే భార్యాభర్తలకు ఏటా రూ.60 వేలు!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 చేతిలో డబ్బులు ఉన్నాయా? మీరు పోస్టాఫీస్ స్కీమ్‌లో చేరాలని భావిస్తున్నారా? అయితే మీకోసం ఒక స్కీమ్ అందుబాటులో ఉంది. అదే మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్. దీని వల్ల ప్రతి నెలా చేతికి డబ్బులు వస్తాయి.

  • పోస్టాఫీస్‌లో అదిరిపోయే స్కీమ్ అందుబాటులో
  • భార్యాభర్తలిద్దరూ చేరే అవకాశం
  • అయితే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి
  • తర్వాత ప్రతి నెలా డబ్బులు చేతికి వస్తాయి
పోస్టాఫీస్‌లో ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో డబ్బులు పెట్టడం వల్ల ఎలాంటి రిస్క్ ఉండదు. అంతేకాకుండా కచ్చితమైన రాబడి కూడా వస్తుంది. అందుకే చాలా మంది స్మాల్ సేవింగ్ స్కీమ్స్‌లో డబ్బులు పెడుతూ ఉంటారు. చాలా స్కీమ్ అందుబాటులో ఉండటం వల్ల ఆర్థిక లక్ష్యాలకు అనువైన పథకాన్ని ఎంపిక చేసుకోవాలి.

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి

పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉన్న పథకాల్లో మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కూడా ఒకటి. ఇందులో చేరితే ప్రతి నెలా డబ్బులు పొందొచ్చు. లేదంటే మూడు నెలలు, ఆరు నెలలు, ఏడాది చొప్పున కూడా మీరు మీ డబ్బులు పొందొచ్చు. అయితే దీని కోసం మీరు ముందుగానే ఒకేసారి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.

మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు

మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ మెచ్యూరిటీ కాలం ఐదేళ్లు. అంటే ఇందులో డబ్బులు పెడితే మీరు ఐదేళ్ల వరకు ఆగాల్సిందే. అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన మొత్తానికి ప్రతి నెలా వడ్డీ వస్తూనే ఉంటుంది. ఎలాంటి రిస్క్ ఉండదు. మీ వడ్డీ మీకు బొట్టు పెట్టినట్లు వస్తుంది.

రూ.1000 నుంచి..

ఈ స్కీమ్‌లో రూ.1000 నుంచి డబ్బులు పెట్టొచ్చు. గరిష్టంగా రూ.4.5 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఒక వ్యక్తికి ఇది వర్తిస్తుంది. అదే జాయింట్ అకౌంట్ తెరిస్తే మాత్రం.. రూ.9 లక్షల వరకు డబ్బులు దాచుకోవచ్చు. ఈ మొత్తానికి మీ వడ్డీ వస్తూనే ఉంటుంది.

ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ

పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో డబ్బుల పెడితే ప్రస్తుతం 6.6 శాతం వడ్డీ రేటు లభిస్తోంది. వడ్డీ రేట్లు అనేవి ప్రతి మూడు నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను ప్రతి త్రైమాసికం సమీక్షిస్తూ వస్తుంది. అందువల్ల రేట్లలో మార్పులు ఉండొచ్చు.

భార్యాభర్తలిద్దరికీ రూ.60 వేలు

భార్యాభర్తలిద్దరూ ఈ పథకంలో చేరితే.. అంటే జాయింట్ అకౌంట్ం తెరవాలి. తర్వాత రూ.9 లక్షలు ఒకేసారి డిపాజిట్ చేసేయాలి. ఇలా చేస్తే ఇద్దరికీ కలిపి ప్రతి ఏటా రూ.60 వేల వరకు లభిస్తాయి. అంటే నెలకు దాదాపు రూ.5 వేల వరకు వస్తాయి. ఇలా ఏడాదిలో రూ.60 వేలు పొందొచ్చు.
postal schem: ఈ పోస్టాఫీస్ స్కీమ్‌లో చేరితే భార్యాభర్తలకు ఏటా రూ.60 వేలు!

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this