Omicron Variant: భారత్‌లోకి ఒమిక్రాన్‌.. బెంగళూరులో రెండు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Omicron Variant: భారత్‌లోకి ఒమిక్రాన్‌.. బెంగళూరులో రెండు కేసులు నమోదు.. ధ్రువీకరించిన కేంద్రం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఏదైతే జరగకూడదని అనుకుంటున్నామో ఏకంగా అదే జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

దక్షిణాఫ్రికా నుంచి బెంగళూరుకు వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియెంట్‌ ట్రేస్‌ అయినట్లు జీనోమ్ స్వీక్వెనింగ్ పరీక్షలో వెల్లడైంది. కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ ఈ బాంబులాంటి వార్త పేల్చారు. ఒమిక్రాన్‌ బారినపడ్డవారిలో ఒకరు 66 ఏళ్ల పురుషుడు, మరొకరు కూడా 46 ఏళ్ల పురుషుడు. ఒమిక్రాన్‌ నిర్ధారణ కావడంతో వీరిద్దరిని క్వారంటైన్‌కు తరలించామని ఆయన చెప్పారు. దీంతో ఈ వేరియెంట్‌ మనదేశంలో మరింత ప్రబలే ప్రమాదం ఉందని.. ప్రజలు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉంటే.. కరోనా డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ వేరియంట్ 5 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని.. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని భయపడుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ)ను ఉటంకిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ తెలిపారు. ఈ వైరస్ 29 దేశాలకు విస్తరించిందని చెప్పారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని ఆందోళన వైవిధ్యాల విభాగంలో ఉంచింది. గత నెల రోజులుగా దేశంలో కొత్త కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. ఇప్పుడు మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల్లో 10 వేలకు పైగా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇది దేశంలోని మొత్తం కేసులలో 55 శాతం అని చెప్పుకొచ్చారు. జనాభాలో 49 శాతం మంది రెండు డోస్‌లు వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత ఈ కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయన్నారు.

 


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this