Thursday, July 31, 2025
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Mi-17V-5 Helicopter Crash : బిపిన్‌ రావత్‌...

Mi-17V-5 Helicopter Crash : బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన Mi-17V-5 ఆర్మీ హెలికాప్టర్‌ ప్రత్యేకతలేంటంటే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భార‌త‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్‌ రావత్‌ తన కుటుంబంతో క‌లిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ Mi-17V-5 తమిళ‌నాడులోని నీలగిరి కొండ‌ల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే.

భార‌త‌ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్‌ రావత్‌ తన కుటుంబంతో క‌లిసి ప్రయణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్‌ Mi-17V-5 తమిళ‌నాడులోని నీలగిరి కొండ‌ల్లో కుప్పకూలిన సంగతి తెలిసిందే. హెలికాప్టర్‌ చెట్టుకు ఢీకొనడం, ఆతర్వాత మంటలు చేలరేగడంతో మొత్తం 11 మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదంలో బిపిన్‌ రావత్‌తో పాటు ఆయన సతీమణి తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇక ప్రమాదానికి గురైన ఆర్మీ హెలికాప్టర్‌ Mi-17V-5 విషయానికొస్తే… ఇది Mi-8-17 కుటుంబానికి చెందిన మిలిట‌రీ ర‌వాణా విమానం.ర‌ష్యాకు చెందిన కాజాన్ హెలికాప్టర్స్‌ దీనిని తయారుచేసింది. ప్రపంచంలోనే అత్యాధునిక ర‌వాణా హెలికాప్టర్‌గా Mi-17V-5 పేరుంది. భద్రతా బలగాల రవాణాకు, అగ్ని ప్రమాదాల కట్టడికి, కాన్వాయ్‌ ఎస్కార్టుగా, పెట్రోలింగ్‌ విధులు, గాలింపు చర్యలు తదితర ఆర్మీ ఆపరేషన్స్‌లో విరివిగా దీనిని ఉపయోగిస్తారు. ఇందులో మొత్తం ముగ్గురు సిబ్బందితో కలిసి 39 మంది ప్రయాణించవచ్చు. Mi-17V-5 లో FLIR సిస్టంతో పాటు అత్యవసర సమయాల్లో సహకరించే ఫ్లోటేషన్‌ సిస్టమ్స్ సదుపాయం ఉంది. ఇది సుమారు 4, 500 కిలోల బరువు వరకు మోసుకెళ్లగలదు. ఇక శత్రువుల దాడుల నుంచి రక్షణ పొందేందుకు S-8 రాకెట్లు, 23 mm మెషిన్‌ గంటి అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను కలిగి ఉంది.

రష్యా నుంచి దిగుమతి..

ఈ Mi-17V-5 హెలికాప్టర్లను భారత ర‌క్షణ శాఖ 2013 ఫిబ్రవరిలో మొదటిసారిగా ఆర్డర్‌ చేసింది. అప్పటి ‘ఏరో ఇండియా ఎయిర్ షో’ సంద‌ర్భంగా మొత్తం 12 హెలికాప్టర్లను ఆర్డర్‌ చేసింది. కాగా మొత్తం 80 హెలికాప్టర్ల కొనుగోలుకు సంబంధించి భారత రక్షణ శాఖ- ర‌ష్యన్ హెలికాప్టర్స్‌ మధ్య 2008 డిసెంబ‌ర్‌లో 1.3 బిలియ‌న్ డాల‌ర్ల ఒప్పందం జరిగింది. ఈ ఎంవోయూలో భాగంగానే ర‌ష్యన్‌ హెలికాప్టర్స్‌ 2011 నుంచి హెలికాప్టర్లను భారత్‌కు అందజేస్తోంది. ఇలా 2013 ప్రారంభం వ‌ర‌కు మొత్తం 36 హెలికాప్టర్లు భారత గడ్డమీద అడుగుపెట్టాయి. అదేవిధంగా 2012-13 మ‌ధ్యకాలంలో 71 Mi-17V-5 హెలికాప్టర్ల కొనుగోలు కోసం భార‌త ర‌క్షణ శాఖ‌, రొసొబ‌రోనెక్స్‌పోర్ట్ మ‌ధ్య పరస్పర ఒప్పందం కుదిరింది. ఈ రొసొబ‌రోనెక్స్‌పోర్ట్ 2018 జూలైలో చివరిసారిగా ఇండియాకు Mi-17V-5 హెలికాప్టర్‌ను డెలివ‌రీ చేసింది. అయితే Mi-17V-5 హెలికాప్టర్ల రిపేరింగ్, సర్వీసింగ్‌ సేవలను భార‌త వాయుసేన 2019 ఏప్రిల్‌లో ప్రారంభించింది.

MI17 V5 ప్రమాదాలివే..

MI17 V5లో ఎన్ని ఆధునిక సదుపాయాలు, రక్షణ సౌలభ్యాలున్నా అప్పుడప్పుడు కొన్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి.
* అక్టోబర్27, 2019 భారత వైమానిక దళానికి చెందిన Mi – 17 V5 హెలికాప్టర్ కేదార్‌నాథ్‌లోని ఎత్తైన ప్రాంతంలో కుప్పకూలింది.
* 2018 ఏప్రిల్ 3న MI17 V5  ల్యాండింగ్‌ సమయంలో ప్రమాదవశాత్తూ ఐరన్ రాడ్‌ను ఢీకొని కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు చనిపోగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
* 2016 అక్టోబర్‌ 19న జరిగిన ఓ శిక్షణ కార్యక్రమంలో MI17 V5 ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. అదృష్టవశాత్తూ ఇందులో ప్రయాణిస్తోన్న15 మందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.
* 2013 జూన్ 25న ఓ వరద సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్న MI17 V5 కుప్పకూలింది. మొత్తం 20 మంది దుర్మరణం పాలయ్యారు.
* 2012 ఆగస్టు 30న శిక్షణలో ఉన్న రెండు MI17 విమానాలు ఢీకొని మొత్తం 9 మంది మృత్యువాత పడ్డారు.

mi-17v-5 helicopter crash : బిపిన్‌ రావత్‌ ప్రయాణించిన mi-17v-5 ఆర్మీ హెలికాప్టర్‌ ప్రత్యేకతలేంటంటే..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this