Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Mangalagiri Cheekati Koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దక్షిణ భారత దేశంలోనే ఎత్తైన మంగళగిరి గాలి గోపురానికి, చీకటి కోనేరుకు ఉన్న సంబంధం ఏంటి..? గాలి గోపురానికి వంద అడుగుల దూరంలోనే కోనేరును ఎందుకు తవ్వారు. చీకటి కోనేరు అభివృద్ధి పనులతో బయటపడుతున్న నిజాలేంటి..? మంగళగిరి గోపురం భద్రతపై నీలిమేఘాలు కమ్ముకున్న దశలో చీకటి కోనేరులో దాగి ఉన్న వాస్తవాలు ఏంటో తెలుసుకుందాం..?

మంగళగిరి శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి గాలిగోపురం దక్షిణ భారత దేశంలోనే ఎత్తయినది. రెండు శతాబ్దాలను పూర్తిచేసుకుంది. 11 అంతస్తులతో 157 అడుగుల ఎత్తును కలిగి కేవలం 49 అడుగుల పీఠభాగంతో,… గాలిలో ఠీవిగా నిలబడినట్టు కనిపిస్తూ సందర్శకులను అబ్బురపరిచే అద్వితీయ నిర్మాణమిది. దీనిని 1807-1809 కాలంలో నాటి ధరణికోట జమిందారు శ్రీ రాజా వాసిరెడ్డి వేంకటాద్రినాయుడు నిర్మించారు. ఈ గోపుర పీఠభాగం పూర్తిగా రాతిచే నిర్మితమైంది. అయితే, గత కొంతకాలంగా గాలిగోపురం పడిపోయే స్థితిలో ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. 2012 నుండి ఈ గోపురాన్ని కాపాడుకునేందుకు స్థానికులు, అధికారులు అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. నెల రోజుల క్రితం కొన్ని పెళ్లలు విరిగి పడటంతో మరోసారి గోపురం భద్రతపై ప్రశ్నలు తలెత్తాయి. ఈ ఘటన జరిగిన వెంటనే దేవాలయం మూఢ వీధుల్లో హెవీ వెహికిల్స్‌తో పాటు వాహనాలు ఏవీ తిరగకుండా గడ్డర్స్‌ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత శిథిలావస్థలకు చేరుకున్న చీకటి కోనేరును అభివృద్ధి చేస్తున్నారు. చీకటి కోనేరును శుభ్రం చేస్తున్న క్రమంలోనే వేంకటేశ్వర స్వామి పంచలోహ విగ్రహం బయటపడింది. వినాయకుడి విగ్రహం కూడా చీకటి కోనేరులో ఉన్నట్లు కనుక్కొని ప్రత్యేక పూజలు చేశారు. అయితే, అసలు చీకటి కోనేరుకు గాలి గోపురానికి సంబంధం ఏంటీ.. అన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.

అత్యంత ఎత్తైన గాలి గోపురం నిర్మాణం చేస్తున్న సమయంలోనే గోపురం ఉత్తరం వైపుకు వంగిపోయిందని స్థానికులు చెబుతారు.. దాన్ని సరి చేసేందుకు గోపుర నిర్మాణ కర్తలు కొంతమంది తమిళనాడులోని కాంచీపురం పంపించారని చెప్పారు. దేవాలయాల ఆర్కిటెక్చర్‌లో కాంచీపురం శిల్పులు అప్పటికే ప్రసిద్ధి చెందారని, వారిచ్చిన సలహాతోనే చీకటి కోనేరును తవ్వినట్లు చెప్పారు. గోపురానికి ఈశాన్య దిశలో వంద అడుగుల దూరంలో గోపురం ఎత్తు అంత లోతులో కోనేరు తవ్వాలని అక్కడి వారు సలహా ఇచ్చారట…. దీంతో ఈశాన్య దిశలో 153 అడుగుల లోతులో చీకటి కోనేరును నిర్మించారని, ఆ తర్వాతే గోపురం ఎటువంటి వంకలు లేకుండా సరైనట్లు చెబుతారు.. చీకటి కోనేరు కూడా గోపురాన్ని తల కిందులుగా చేసినట్లు నిర్మించారట… లోతుకు పోయే కోద్దీ వెడల్పు తగ్గించుకుంటూ పోయారు. గోపురం కింద నుండి పైకి ఉంటే కోనేరు అందుకు వ్యతిరేకంగా నిర్మించారంటున్నారు.

చరిత్రలో భాగమైన గోపురాన్ని కాపాడుకునేందుకు అందరూ కట్టుబడి ఉండాలని స్థానికులు చెబుతున్నారు.. గతంలోనూ గోపురం భద్రతపై అనుమానాలు కమ్ముకున్నాయని ఒకానోక దశలో పడేసేందుకు సిద్ధమయ్యారని అంటున్నారు.. అయితే స్థానికుల ఆందోళన తర్వాత పడేయాలన్న ఆలోచన విరమించుకోని ఏ విధంగా కాపాడుకోవాలో ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పారు. గోపురం పునాదులు గతంలో తడికే రూపంలో వెడల్పుగా వేసేవారని, గోపురం పక్కనే ఉన్న రోడ్డు కింద కూడా పునాదులున్నాయని చెబుతున్నారు. భారీ వాహనాలు తిరగడంతోనే పునాదులు దెబ్బతిని గోపురం భద్రత ప్రశ్నార్థకమైందన్నారు. చీకటి కోనేరును అభివృద్ధి చేయడం మంచిదేనన్నారు. అయితే ఇటలీలోని పీసా టవర్‌ పడిపోకుండా రీట్రో ఫిట్టింగ్‌ టెక్నాలజీని వాడారని అటువంటి సాంకేతిక ద్వారా గోపురాన్ని కాపాడుకోవచ్చునంటున్నారు… 2012 లో చెన్నై ఐఐటీ నిపుణులు ఇచ్చిన నివేదిక బయటపెట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గోపురం చుట్టు పక్కల చిన్నచిన్న గుంతలు ఏర్పాటు చేసి అందులో కాంక్రీట్‌ ఫిల్లింగ్‌ చేయాలన్నారు. ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టి గోపురాన్ని కాపాడాలని డిమాండ్‌ చేస్తున్నారు.

చీకటి కోనేరును అభివృద్ధి చేయడంతో పాటు గోపురాన్ని కాపాడుకోవటానికి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి.

mangalagiri cheekati koneru: మంగళగిరిలో చీకటి కోనేరు రహస్యం

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this