Instagram: మీకు నచ్చని వారు చేసే కామెంట్లు,...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Instagram: మీకు నచ్చని వారు చేసే కామెంట్లు, అందరికీ కనిపించకుండా చేయొచ్చు.. ఇన్‌స్టాగ్రామ్‌ కొత్త ఫీచర్‌..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 ఇన్‌స్టాగ్రామ్‌లో మనం ఏదైనా పోస్ట్‌ చేస్తే రకరకాల కామెంట్లు చేస్తుంటారు. అందులో మనకు నచ్చని కామెంట్లు చేస్తుంటారు కొందరు. అయితే ఆ కామెంట్లను ఇతరులు కూడా చూసే అవకాశం ఉంటుంది.

అలా కాకుండా మీరు ఎంచుకున్న వ్యక్తి కామెంట్లు కేవలం మీకే కనపడేట్లు ఉంటూ ఇతరులెవరికీ కనిపించకపోతే భలే ఉంటుంది. కదూ.. ఇలాంటి ఫీచర్‌నే తీసుకొచ్చింది ఇన్‌స్టాగ్రామ్‌. ఈ ఫీచర్‌తో వ్యక్తిని పూర్తిగా బ్లాక్‌ చేయకుండా కామెంట్లు ఇతరులకు కనిపించకుండా చేసుకోవచ్చు.

ఇందుకోసం మూడు విధానాలు అందుబాటులో ఉన్నాయి.. అందులో ఒకటి, ఎవరి కామెంట్స్‌ కనిపించకూడదనుకుంటున్నారో వారి ప్రొఫైల్‌కు వెళ్లాలి. అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌ పాప్ అప్ చూపిస్తుంది. అక్కడ రిస్ట్రిక్ట్ అకౌంట్​పై క్లిక్ చేస్తే సరిపోతుంది.

రెండో విధానం ద్వారా మీరు ఎవరినైతే రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటున్నారో వారి డైరెక్ట్‌ మెసేజ్‌ విభాగంలోకి వెళ్లాలి. అనంతరం సదరు వ్యక్తి చాట్‌ను ఓపెన్‌ చేసి.. షేర్డ్ మీడియా, చాట్ సెట్టింగ్‌లోకి వెళ్లి రిస్ట్రిక్ట్ బటన్ క్లిక్ చేయాలి.

మూడో విధానంలో.. ముందుగా ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత కనెక్షన్స్ కింద రిస్ట్రిక్ట్ అకౌంట్స్ క్లిక్ చేయాలి. తర్వాత ఎవరినైతే రిస్ట్రిక్ట్​చేయాలనుకుంటున్నారో సెర్చ్‌ చేసి వారి పేరు పక్కన రిస్ట్రిక్ట్ క్లిక్ చేస్తే చాలు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this