High Court : గురుకుల టీజీటీ పోస్టులకు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

High Court : గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు అర్హులేః హైకోర్టు తీర్పు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Telangana High Court on Gurukul TGT Posts: తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. రాష్ట్రంలో గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు కూడా అర్హులేనని హైకోర్టు తీర్పు ఇచ్చింది. 

టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థుల అర్హతపై సోమవారం ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. వాదనలు విన్న న్యాయస్థానం బీఈడీ పూర్తి చేసిన బీటెక్‌ అభ్యర్థులు అర్హులని తీర్పునిస్తూ గురుకుల విద్యాసంస్థల నియామక బోర్డు అప్పీళ్లను హైకోర్టు కొట్టివేసింది. 

బీఈడీ చేసిన బీటెక్‌ అభ్యర్థులను పరిగణనలోకి తీసుకోవాలని.. నాలుగు వారాల్లో నియామకాలు చేపట్టాలని సంబంధిత శాఖకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీఎడ్‌ ప్రవేశాల నిబంధనల్లో పలు మార్పులు తీసుకువచ్చింది. ఇప్పటిదాకా బీఏ, బీకాం, బీఎస్సీ వంటి సంప్రదాయ కోర్సులు చదివిన వారు మాత్రమే బ్యాచిలర్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌లో (బీఎడ్‌) (Telangana EDCET 2021) చేరే అవకాశం ఉండగా ఇకపై ఇతర సబ్జెక్టులు చదివిన వారికి బీఎడ్‌లో చేరే అవకాశం కల్పించింది. 

ఈ మేరకు జీవో 16 జారీ చేసింది తెలంగాణ విద్యాశాఖ.ఇప్పటివరకు డిగ్రీలో ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌ చదువుకున్న వారికి బీఎడ్‌లో చేరే అవకాశం దక్కింది. డిగ్రీలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీఎస్సీ (హోంసైన్స్‌), బీసీఏ, బీబీఎం, బీఏ (ఓరియంటల్‌ లాంగ్వేజెస్‌), బీబీఏ, బీటెక్‌ చేసిన వారు కూడా బీఎడ్‌ చదివే వీలు ఏర్పడింది. 

అయితే, ఆయా డిగ్రీల్లో 50 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఇక, బీఎడ్‌ ఫిజికల్‌ సైన్స్‌ చేయాలంటే.. బీఎస్సీ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ లేదా సంబంధిత సబ్జెక్టును పార్ట్‌–2 గ్రూపులో చదివి ఉండాలి. 

బీటెక్‌ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ; బీసీఏ విద్యార్థులు ఫిజిక్స్‌ లేదా కెమిస్ట్రీ సబ్జెక్టులను ఇంటర్మీడియట్‌లో చదివి ఉంటే సరిపోతుంది.

high court : గురుకుల టీజీటీ పోస్టులకు బీటెక్‌ అభ్యర్థులు అర్హులేః హైకోర్టు తీర్పు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this