Health Tips: ‘టీ’తో కలిపి ఈ ఆహారపదార్ధాలను...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Health Tips: ‘టీ’తో కలిపి ఈ ఆహారపదార్ధాలను తీసుకుంటున్నారా.. అలాగైతే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Health Tips: టీ .. ఈ మాట వింటే చాలు చాలామందికి హుషారు వచ్చేస్తుంది. ఒక్క చిన్న కప్పు టీ తాగినా బద్ధకం వదిలి తీరి.. హుషారుగా ఉత్సాహంగా పనులు చేసుకోవడానికి రెడీ అయిపోతారు. నిజానికి ఈ టీ .. అలవాటు భారతీయులకు బ్రిటిష్ వారు మనదేశంలో అడుగు పెట్టిన తర్వాత వచ్చిందే.. వారు మనదేశాన్ని విడిచి వెళ్లినా ఇప్పటికీ ఈ తేనీరు తాగే అలవాటు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ తేనీరు ప్రియులు రోజు రోజుకీ అధికమవుతూనే ఉన్నారు. అంతేకాదు ఈ తేనీరులో అనేక రకాలు తయారు చేస్తూ.. విభిన్న రుచులను ఆస్వాదిస్తున్నారు. అయితే మనదేశంలో ఎక్కువగా టీని పాలు వేసుకుని తాగుతారు.  చాలా మందికి రోజు మొదలు పెట్టాలంటే టీ కావాలి. మరికొందరు.. గంట గంటకు నీరు తగినట్లు టీ తాగుతారు. అయితే మరికొందరు టీ తో పాటు మరికొన్ని ఆహారపదార్ధాలను కలిపి తీసుకుంటారు. ఇలా కొన్ని పదార్ధాలను తేనీరుతో కలిపి తీసుకుంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకనే కొన్ని పదార్ధాలను టీ తో సమానంగా. లేదా ముందు, తర్వాత తీసుకోకూడదని అంటున్నారు. టీ తో కాంబినేషన్ గా తీసుకోకూడని ఆహారపదార్ధాలు ఏమిటో చూద్దాం..

మొలకెత్తిన గింజలు:

చాలామంది మొలకెత్తిన గింజలు తింటే ఆరోగ్యానికి మంచిది అని .. సమయం సందర్భం లేకుండా ఎప్పుడు గుర్తుకొస్తే  అప్పుడు తింటారు. అయితే ఇలా మొలకెత్తిన గింజలు తినడానికి ముందు గానీ.. తర్వాత గానీ టీ తాగకూడదు. కనీసం మొలకెత్తిన గింజలను తిన్న తర్వాత.. లేదా టీ తాగిన తర్వాత ఎప్పుడు తీసుకున్నా కనీసం అరగంట గ్యాప్ ఇవ్వాలని సూచిస్తున్నారు. మొలకెత్తిన గింజల్లో ఫైటేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది భాస్వర మూలకంగా ఇది పనిచేస్తుంది. కనుక  టీతో పాటు మొలకెత్తిన గింజలను తినడకూడదు.  తీసుకుంటే గ్యాస్ ప్రాబ్లెమ్ తో ఇబ్బంది పడాల్సి వస్తుందట.

ఆకు కూరలు: 

టీ తాగడానికి ముందు లేదా తాగిన అనంతరం ఐరన్ తో ఉన్న ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా ఆకు కూరల్ని అసలు తీసుకోకూడదు. ఎందుకంటే టీలో టానిన్లు మరియు ఆక్సలేట్‌లు ఉంటాయి. కనుక ఇవి ఐరన్ శోషణను అడ్డుకుంటాయి. దీంతో ఆరోగ్య పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందట.

పచ్చికూరగాయలు:

టీ తాగడానికి ముందు కానీ టీ తాగిన తర్వాత కానీ పచ్చి కాయగూరల్ని అస్సలు తీసుకోకూడదు. ముఖ్యంగా బ్రోకలీ అసలు తీసుకోకూడదు. పచ్చి కూరలో ఉండే గోయిట్రోజన్లు కొందరిలో ఐయోడిన్ లోపాన్ని తీసుకొస్తాయి. కనుక టీ తాగడానికి ముందు కానీ తర్వాత కానీ అస్సలు పచ్చికూరగాయలు తినకూడదు అంటున్నారు.

శనగపిండి ఆహారపదార్ధాలు: 

సర్వసాధారణంగా టీ  పాటు పకోడీని కలిసి తింటారు. ఇది సర్వసాధారణంగా అందరూ చేసే పనే.. అయితే  టీ టైమ్ స్నాక్స్ గా శనగ పిండితో చేసే పదార్ధాలను తినడం తగ్గిస్తే ఆరోగ్యానికి మంచిది. టీతాగుతూ.. శనగపిండి తో చేసిన ఆహారపదార్ధాలు తిండడం వలన కొంతమందిలో జీర్ణ సమస్యలు తలెత్తవచ్చు. అంతేకాదు ఈ కాంబో శరీరం పోషకాలను   గ్రహించే సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కనుక టీతో ఈ కంబోని తగ్గించడం లేదా అప్పుడప్పుడు మాత్రమే తీసుకోవాలి.

పసుపు: 

టీ తాగేటప్పుడు పసుపు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. ఈ కాంబినేషన్ గ్యాస్, అసిడిటీ లేదా మలబద్ధకం వంటి  సమస్యలను కలిగిస్తుంది. పసుపు , తేయాకులు విరుద్ధ ప్రయోజనాలుకలిగి ఉన్నాయి.
health tips: ‘టీ’తో కలిపి ఈ ఆహారపదార్ధాలను తీసుకుంటున్నారా.. అలాగైతే ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్లే!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this