Credit Debit Cards New Rules :...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Credit Debit Cards New Rules : జనవరి నుండి పేమెంట్స్ చేయాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాలి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Credit Debit Cards New Rules :  క్రెడిట్, డెబిట్ కార్డు యూజర్లకు అలర్ట్. కొత్త ఏడాది నుంచి కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. క్రెడిట్, డెబిట్ కార్డు కలిగిన వారు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.

Credit Debit Cards New Rules

కొత్త రూల్స్ ప్రకారం.. జనవరి 1 నుంచి లావాదేవీలు నిర్వహించాలంటే 
  • క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు 16 అంకెలు ఎంటర్ చేయాలి. 
  • లేదంటే టోకెనైజేషన్ పద్ధతిని వాడాలి. 
  • ఇందులో మీకు నచ్చిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవచ్చు.

ఇకపై వెబ్‌సైట్లు, పేమెంట్ గేట్‌వేస్‌లలో కస్టమర్ల క్రెడిట్, డెబిట్ కార్డుల వివరాలు నిక్షిప్తం కావు. ఇప్పటికే స్టోర్ అయిన వివరాలన్నీ కూడా తొలగించాల్సి ఉంటుంది. 

కార్డు నెంబర్లకు బదులు టోకెన్ నెంబర్లు వస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ చేసేటప్పుడు లేదంటే డిజిటల్ చెల్లింపులు చేసేటప్పుడు మర్చంట్ వెబ్‌సైట్స్, యాప్స్ వంటివి కస్టమర్ల క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు వివరాలను స్టోర్ చేయకూడదు. 
ఈ Credit Debit Cards New Rules జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. అంటే కొత్త ఏడాది నుంచి మీరు కార్డు ద్వారా ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే.. ఆ వివరాలు స్టోర్ కావు.

Credit Debit Cards New Rules from January 1st, 2021

ఇక.. టోకెనైజేషన్ విధానంలో కార్డు కలిగిన వారు వారి కార్డు వివరాలను తెలియజేయాల్సిన పని లేదు. ఒరిజినల్ కార్డు నెంబర్‌కు బదులు ప్రత్యామ్నాయ కోడ్ ఇస్తారు. 
దీన్ని టోకెన్ అని పిలుస్తారు. అప్పుడు లావాదేవీ సమయంలో ఈ కోడ్‌ను అందిస్తే సరిపోతుంది. ట్రాన్సాక్షన్ పూర్తవుతుంది. ప్రతి కార్డును ప్రత్యేకమైన టోకెన్ జారీ చేస్తారు.
కార్డుల ద్వారా జరిపే లావాదేవీలను మరింత సురక్షితంగా మార్చాలనే లక్ష్యంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) కొత్త రూల్స్ తీసుకొస్తోంది. 
ఆర్బీఐ 2020 మార్చిలోనే ఈ విషయాన్ని వెల్లడించింది. డేటా సెక్యూరిటీ నిబంధనల ప్రకారం.. వెబ్‌సైట్స్, యాప్స్ కస్టమర్ల కార్డుల వివరాలను స్టోర్ చేయకూడదని ఆదేశించింది.
ఆర్బీఐ నిబంధనల నేపథ్యంలో బ్యాంకులు ఇప్పటికే తమ కస్టమర్లను అలర్ట్ చేస్తున్నాయి. మర్చంట్ వెబ్‌సైట్ లేదా యాప్‌లో బ్యాంక్ కార్డు వివరాలు స్టోర్ చేయడం కుదరదని తెలుపుతున్నాయి. 
జనవరి 1 నుంచి Credit Debit Cards New Rules ప్రకారం లావాదేవీ నిర్వహించిన ప్రతిసారి కార్డు వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేశాయి. లేదంటే టోకనైజేషన్ సిస్టమ్‌ను అనుసరించాలని సందేశాలు పంపుతున్నాయి.
credit debit cards new rules :  జనవరి నుండి పేమెంట్స్  చేయాలంటే ఈ రూల్స్ తెలుసుకోవాలి

వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this