Budget Phone: బడ్జెట్ ఫోన్ మోటో జీ31...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Budget Phone: బడ్జెట్ ఫోన్ మోటో జీ31 సేల్ ప్రారంభం.. స్పెసిఫికేషన్లు, ధర ఇవే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  •  మోటో జీ31 సేల్ ప్రారంభం
  • అమోలెడ్ డిస్‌ప్లే, 5000ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తోన్న మొబైల్‌
  • రూ.12,999గా ప్రారంభ ధర

మంచి స్పెసిఫికేషన్లతో బడ్జెట్ రేంజ్‌లో లాంచ్ అయిన మోటో జీ31 (Moto G31) సేల్ నేడు ప్రారంభమైంది. బడ్జెట్ రేంజ్‌లో ఆకర్షణీయమైన ఫీచర్లతో మోటోరోలా (Motorola) నుంచి ఈ ఫోన్‌ గత వారం విడుదలైంది. ముఖ్యంగా ఈ ఫోన్‌ అమోలెడ్ డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఈ కామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాయి. మోటో జీ31 స్పెసిఫికేషన్లు, ధర, వేరియంట్ల వివరాలు చూసేయండి.

మోటో జీ31 (Moto G31) స్పెసిఫికేషన్లు

6.47 ఇంచుల ఫుల్ హెచ్‌డీ అమోలెడ్ డిస్‌ప్లేతో మోటో జీ31 వస్తోంది. 700నిట్స్ పీక్ బ్రైట్నెస్, 20:9 ఆస్పెక్ట్ రేషియా, 60హెట్జ్ రిష్రెష్ రేట్ ఉన్నాయి. అక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ85 4జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్‌ నడుస్తుంది. మాలి జీ52 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ ఇందులో ఉంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తున్న ఈ మొబైల్‌ 10వాట్ల చార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది.

మోటో జీ31లో వెనుక మూడు కెమెరాల అమరిక ఉంది. 50మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, 2మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ ఉన్నాయి. అలాగే వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

యూఎస్బీ టైప్-సీ పోర్టు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5ఎంఎం ఆడియో జాక్ తో పాటు గూగుల్ అసిస్టెంట్ కోసం ప్రత్యేకమైన బటన్ తో వస్తోంది మోటో జీ31 మొబైల్‌. అలాగే 181 గ్రాముల బరువు ఉండనుంది. మోటోరిట్ గ్రే, బేబీ బ్లూ కర్ వేరియంట్లలో ఇది అందుబాటులో ఉంది. డ్యుయల్ సిమ్, మైక్రో ఎస్డీ కార్డ్ స్లాట్ (హైబ్రిడ్) ఈ ఫోన్‌లో ఉంది.

మోటో జీ31 ధర

మోటో జీ31 మొబైల్‌ రెండు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. 4జీబీ ర్యామ్+64జీబీ స్టోరేజీ, 6జీబీ ర్యామ్+128జీబీ స్టోరేజీ ఆప్షన్లలో లభిస్తోంది. 64జీబీ వేరియంట్ ధర రూ.12,999గా ఉంది. అలాగే 128జీబీ స్టోరేజీ వేరియంట్ రేట్ రూ.14,999గా నిర్ణయించింది మోటోరోలా. ఫ్లిప్ కార్ట్ లో ఈ ఫోన్‌ అమ్మకానికి ఉంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this