ఏపీలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరంలో ఒమిక్రాన్ కేసు నమోదైనట్లు తెలిపింది. మొదట ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన ప్రయాణికుడికి ముంబైలో టెస్ట్ చేయగా.. కోవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. దీంతో ముంబై నుంచి సదరు ప్రయాణికుడు విజయనగరం వెళ్లాడు. విజయనగరంలో మరోసారి టెస్ట్ చేయగా ఒమిక్రాన్ సోకినట్లు తేలింది. దీంతో అధికారులు అలెర్టయ్యారు. బాధితుడిని ఐసోలేషన్‌లో ఉంచి.. చికిత్స అందిస్తున్నారు. ప్రజలు ఆందోళన చెందొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించింది.
Breaking: ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు.. విజయనగరం జిల్లాలో నిర్ధారణ
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.