Saturday, February 14, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

Block ATM Card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Block ATM Card: ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు జరిపే వారి సంఖ్య తగ్గిపోయింది. మొత్తం డిజిటల్‌ మయం అయిపోయింది. అయితే డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌..

Block ATM Card: ప్రస్తుతం బ్యాంకులకు వెళ్లి లావాదేవీలు జరిపే వారి సంఖ్య తగ్గిపోయింది. మొత్తం డిజిటల్‌ మయం అయిపోయింది. అయితే డెబిట్‌ కార్డుల ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీలు భారీగా జరుగుతున్నాయి. ఏటీఎం నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవడం, ఆన్‌లైన్‌లో ఆర్డర్ల కోసం డెబిట్‌ కార్డులను ఉపయోగించడం జరుగుతున్నాయి. అయితే డెబిట్‌ కార్డులు వేరే వారికి చిక్కినప్పుడు లేదా హ్యాకర్లు కార్డును హ్యాక్ చేసి అన‌ధికారిక ఆన్‌లైన్ లావాదేవీల‌కు కూడా వీటిని ఉప‌యోగించవచ్చు. అలాగే ఆన్‌లైన్‌ షాపింగ్‌ల ద్వారా కూడా డెబిట్‌ కార్డు దుర్వినియోగం కూడా జరుగుతున్నాయి. మోసగాళ్ల చేతిలో చిక్కి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఏదైనా మోసం జరిగితే వెంటనే డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయించి మరింతగా నష్టపోకుండా కాపాడుకోవచ్చు. ఏదైనా డెబిట్‌ కార్డు మోసం జరిగినప్పుడు, లేదా మీ కార్డు పోగొట్టుకున్నప్పుడు ముందు జాగ్రత్తగా కస్టమర్‌కేర్‌ను సంప్రదించి కార్డును బ్లాక్‌ చేస్తుంటాము. అలా కాకుండా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా మీరు డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేసుకోవచ్చు.

ఎస్‌బీఐ డెబిట్‌ కార్డు పోయినప్పుడు కార్డు బ్లాక్‌ చేయండిలా..

ముందుగా కస్టమర్‌ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా లాగిన్‌ కావాలి.
ఆ తర్వాత ఈ-సర్వీసెస్‌ ట్యాబ్‌ కింద ఏటీఎం కార్డు ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఏటీఎం/ డెబిట్‌ కార్డును బ్లాక్‌ చేయాల్సిన ఖాతాను ఎంచుకోవాలి.
ఆ తర్వాత బ్లాక్‌ చేసే కార్డు మొదటి 4 అంకెలు, చివరి 4 అంకెలు స్క్రీన్‌ పై కనిపిస్తుంటాయి. బ్లాక్‌ చేయాల్సిన కార్డును ఎంచుకుని వివరాలు ధృవీకరించిన తర్వాత సబ్‌మిట్‌ పై నొక్కాలి.
ఆ తర్వాత ప్రొఫైల్‌ పాస్‌వర్డ్‌ లేదా మీ ఫోన్‌ నెంబర్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి కన్ఫర్మ్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
 ఈ ప్రక్రియ విజయవంతం అయిన తర్వాత ఒక నంబర్‌ స్క్రీన్‌పై కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం ఈ నంబర్‌ను గుర్తించుకోవడం ముఖ్యం.
block atm card: మీ బ్యాంకు ఏటీఎం కార్డు ఆన్‌లైన్‌లో బ్లాక్‌ చేయాలని అనుకుంటున్నారా..? ఇలా చేయండి..!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this