Black box for Earth: ఈ బ్లాక్...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Black box for Earth: ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందో తెలుసా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

త్వరలో ప్రపంచం అంతం కాబోతోందా? దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ బాక్స్ తయారుచేశారా? అసలు ఎందుకీ ఇది? దీని ద్వారా మనకు కలిగే ప్రయోజనం ఏంటి?

బ్లాక్ బాక్స్ (Black box) అనగానే మనకు విమాన ప్రమాదాలు గుర్తుకు రావడం సహజం. ఎందుకంటే ఏదైనా విమాన ప్రమాదం జరిగితే… అది ఎలా జరిగిందో వివరాలు బ్లాక్ బాక్స్ ద్వారా తెలిసే అవకాశాలు ఉంటాయి. అది పైలెట్ల సంభాషణలను రికార్డ్ చేస్తుంది. తద్వారా భవిష్యత్తులో అలాంటి ప్రమాదాలు జరగకుండా చేసేందుకు వీలవుతుంది. అదే విధంగా భూమి కోసం ఓ బ్లాక్ బాక్స్ (Black box for Earth) రెడీ అయ్యింది. దీన్ని తయారుచెయ్యడానికి బలమైన కారణం ఉంది. సపోజ్.. ఈ భూమిపై ఉన్న మనుషులు, జీవులు అందరూ చనిపోతే… ఆ తర్వాత ఏమవుతుంది? ఏదైనా ఇతర గ్రహం నుంచి గ్రహాంతరవాసులు (Aliens) భూమికి వస్తే… ఇక్కడ జీవులు ఎలా చనిపోయాయో వారికి తెలియాలి కదా… అందుకోసమే ఈ బ్లాక్ బాక్స్ తయారుచేశారు.

భూమికి ఏమవుతోంది?

అసలు భూమికి ఇప్పుడు వచ్చిన సమస్యేంటి? యుగాంతం వచ్చేసిందా? అనేది కొందరు వేస్తున్న ప్రశ్న. అలాంటిది ఏమీ లేదు. భూమి బాగానే ఉంది. కాకపోతే… అలా అయితే అప్పుడేంటి పరిస్థితి… అని ఆలోచించి ఈ బ్లాక్ బాక్స్ తయారుచేశారు. వాతావరణ మార్పుల వల్ల ఏమైనా జరగొచ్చు అని ఊహించుకొని దీన్ని రెడీ చేశారు.

బాక్స్ ఎక్కడ ఉంది?

ఆస్ట్రేలియాలోని… టాస్మేనియా పశ్చిమ తీరంలో దీన్ని నిర్మించారు. 2022 నాటికి దీని నిర్మాణం వంద శాతం పూర్తవుతుందని తెలిపారు. భూమిపై ప్రళయం అంటే… యుగాంతం మొదలవ్వగానే… ఇది ప్రతీ అంశాన్నీ రికార్డ్ చెయ్యడం మొదలుపెడుతుంది. ఇప్పటికే ఇది బీటా వెర్షన్‌లో లైవ్ రికార్డ్ (live recording) చేస్తున్నట్లు దీన్ని తయారుచేసిన.

భవిష్యత్తుకు హెచ్చరిక:

యుగాంతం తర్వాత… ఇదే భూమిపై ఎవరైనా పుట్టినా… లేక బయటి నుంచి ఏలియన్స్ వచ్చినా… ఈ బాక్స్ ద్వారా వారు ఏం జరిగిందో తెలుసుకుంటారు. అలాంటి పొరపాటు వారు చెయ్యకుండా జాగ్రత్త పడేందుకు ఇందులో రికార్డ్ అయ్యే డేటా హెచ్చరికగా ఉంటుందని భావిస్తున్నారు.

దీని సైజ్ ఎంత ఉంది:

ఫొటోలో చూస్తే చిన్న బాక్స్‌లా ఉంది గానీ… ఇది పెద్దదే. ఓ స్కూల్ బస్సు సైజులో ఉంది. చుట్టూ 3 అంగుళాల స్టీల్ కోటింగ్ ఉంది. దీనికి సోలార్ ప్యానెళ్లు ఉన్నాయి. తద్వారా కావాల్సిన పవర్ తయారుచేసుకుంటుంది. దీన్లో బోలెడంత డేటా స్టోర్ చెయ్యడానికి స్టోరేజ్ డ్రైవ్స్ ఉన్నాయి. ఇవి వచ్చే 30 నుంచి 50 ఏళ్ల దాకా పాడవకుండా ఉంటాయట.

ఎలా రికార్డ్ చేస్తుంది?

బీటా వెర్షన్‌లో ట్రయల్ పూర్తయ్యాక… ఎప్పుడు కావాలంటే అప్పుడు దీన్ని యాక్టివేట్ చేస్తారు. ఆ తర్వాత నుంచి ఇది పనిచేయడం ప్రారంభిస్తుంది. ఆ క్షణం నుంచి ఇది భూమిపై వచ్చే మార్పుల్ని రికార్డ్ చేస్తుంది. వాతావరణం, ఉష్ణోగ్రతలు, తుఫానులు, గాలి కాలుష్యం, కార్బన్ డై ఆక్సైడ్ లెవెల్స్ అన్నీ రికార్డ్ చేస్తూ ఉంటుంది. అంతే కాదు మనిషి లాగా ఇది ఇంటర్నెట్‌లో స్వయంగా సెర్చ్ చేసుకొని డేటా సేకరించుకునేలా దీనికి ప్రత్యేక ఆల్గారిథం (algorithm) సెట్ చేశారు. సోషల్ మీడియా పోస్టులు, మీమ్స్ అన్నీ ఇది చదవగలదు.

ఎవరు తయారుచేశారు?

ఈ బ్లాక్ బాక్స్‌ని మార్కెటింగ్ కమ్యూనికేషన్స్ కంపెనీ క్లెమెంజర్ BBDO తయారుచేసింది. ఇందుకు టాస్మేనియా యూనివర్శిటీ పరిశోధకులు సాయం చేశారు. మొత్తానికి దీని కారణంగా యుగాంతం త్వరలోనే వచ్చేస్తోందా అనే చర్చ జరుగుతోంది.

black box for earth: ఈ బ్లాక్ బాక్స్ ఏం చేస్తుందో తెలుసా?


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this