Before December 31st, 2021: 31 డిశంబర్...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Before December 31st, 2021: 31 డిశంబర్ 2021 కల్లా పూర్తి చేయాల్సిన 4 అతి ముఖ్యమైన పనులు.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సంవత్సరం చివరి నెలలో అంటే డిసెంబర్‌ (December)లో మీరు చాలా ముఖ్యమైన పనులను పూర్తి చేయాల్సి ఉంటుంది. మీరు ఇంకా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేయకుంటే, డిసెంబర్‌ (December) 31, 2021లోగా చేయండి. అదే సమయంలో, ఈ నెలాఖరులోగా నామినీలను జోడించాలని పీఎఫ్ ఖాతాదారులను ఈపీఎఫ్‌ఓ ​​కోరింది. ఈ నెలలో మీరు చేయవలసిన 4 కీలకమైన పనులేంటో ఓసారి చూద్దాం. అవి పూర్తి చేయ లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఇన్‌కం టాక్స్ రిటర్న్ .. పూర్తి చేయ లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

ఆదాయపు పన్ను రటర్న్ (ఐటీఆర్) ఆర్థిక సంవత్సరం 2020-21 కోసం 31 డిసెంబర్‌ (December), 2021 వరకు దాఖలు చేయాల్సి ఉంటుంది. పన్ను నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఐటీఆర్‌ని సకాలంలో ఫైల్ చేయడం వల్ల పెనాల్టీల నుంచి మిమ్మల్ని రక్షించడమే కాకుండా అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. నిర్ణీత తేదీలోపు ఐటీఆర్ ఫైల్ చేయనందుకు మీరు పెనాల్టీ చెల్లించాల్సి రావచ్చు. అంతే కాకుండా నోటీసులు వస్తాయోమనని భయపడాల్సి ఉంటుంది. అందుకే డిసెంబర్‌ (December) 31, 2021లోపు ఇన్‌కం టాక్స్ రిటర్న్ దాఖలు చేయాలి.

పీఎఫ్ ఖాతాదారులు నామినీని జోడించాలి..

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పీఎఫ్ ఖాతాదారులందరినీ నామినీని జోడించమని కోరింది. నామినీలను జోడించడానికి 31 డిసెంబర్‌ (December), 2021 2021ని గడువుగా నిర్ణయించింది. మీరు డిసెంబర్‌ (December) 31, 2021లోగా మీ పీఎఫ్ ఖాతాకు నామినీని జోడించకపోతే, మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుంది. EPFO సైట్‌ని సందర్శించి నామినీని యాడ్ చేయాలి.

ఒక ఈపీఎఫ్ సభ్యుడు మరణించిన సందర్భంలో పీఎఫ్ డబ్బు, ఉద్యోగి పెన్షన్ పథకం (EPS), ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ (EDLI) ప్రయోజనాలను సులభంగా పొందడంలో నామినేషన్ చేయడం సహాయపడుతుంది. ఇది నామినీని ఆన్‌లైన్‌లో క్లెయిమ్‌లను ఫైల్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.

తక్కువ వడ్డీకే గృహ రుణం..

బ్యాంక్ ఆఫ్ బరోడా పండుగ సీజన్‌లో గృహ రుణ వడ్డీ రేటును 6.50%కి తగ్గించింది. కొత్త రుణం కాకుండా, ఇతర బ్యాంకుల నుంచి బదిలీ చేసే గృహ రుణాలపై కూడా కొత్త వడ్డీ రేటు ప్రయోజనం అందుబాటులో ఉంటుంది. ఈ ఆఫర్ ప్రయోజనం డిసెంబర్‌ (December) 31, 2021 వరకు అందుబాటులో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నట్లయితే, మీరు డిసెంబర్‌ (December) 31, 2021 వరకు దరఖాస్తు చేయడం ద్వారా ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవచ్చు.

ఆడిట్ నివేదికను దాఖలు చేయడం..

వార్షిక ఆదాయం రూ. 10 కోట్ల కంటే ఎక్కువ ఉన్న వ్యాపారంతో అనుబంధం ఉన్న వ్యక్తులు, వారు ఆదాయపు పన్ను రిటర్న్‌తో పాటు ఆడిట్ నివేదికను దాఖలు చేయాలి. ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు, డాక్టర్లు, సినీ నటులు, లాయర్లు, టెక్నీషియన్లు వంటి నిపుణులు రూ. 50 లక్షలకు మించిన ఆదాయంపై మాత్రమే ఆడిట్ రిపోర్టులు దాఖలు చేయాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి ఆడిట్ దాఖలు చేయడానికి గడువు కూడా డిసెంబర్‌ (December) 31, 2021వరకే ఉంది.

before december 31st, 2021: 31 డిశంబర్ 2021 కల్లా పూర్తి చేయాల్సిన 4 అతి ముఖ్యమైన పనులు.. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this