Andal Thiru Nakshatram: భగవంతుడి సేవలో తరించిన...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Andal Thiru Nakshatram: భగవంతుడి సేవలో తరించిన గోదా దేవి జీవిత చరిత్ర.. దివ్య ధనుర్మాస విశిష్టత

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Goda Devi Life Story: ‘తిరుప్పావై’ అనే మాట వినగానే గోదాదేవి కళ్ళ ముందు సాక్షాత్కరిస్తుంది. గోదాదేవినే ‘ఆండాళ్’ అని పిలుస్తారు. ఆమెను నాచియార్ అని కూడా పిలుస్తారు.  పణ్ణిద్దరు (పన్నెండు మంది) ఆళ్వారులు పాడిన/ రచించిన పాశురాలు ’నాలాయిర (4000) దివ్య ప్రబంధం’గా, ‘ద్రవిడవేదం’గా ప్రసిద్ధి పొందాయి. ఆ ఆళ్వారులలో గోదాదేవి ఒక్కరే మహిళ. శ్రీరంగనాథుడిని భర్తగా పొందడానికి ధనుర్మాసంలో మార్గళి వ్రతాన్ని ఆచరించిన సందర్భంలో, వటపత్ర శాయిని కీర్తిస్తూ గోదాదేవి పాడిన పాశురాలు ‘తిరుప్పావై’గా నాలాయిర ప్రబంధంలో నిబద్ధమయ్యాయి. ద్రవిడ వేదానికి తిరుప్పావై హృదయం లాంటిది. మహావిష్ణువు ఆజ్ఞ మేరకు సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి భూలోకంలో గోదాదేవిగా అవతరించింది.

శ్రీవిష్ణుచిత్తుల (పెరియాళ్వార్) ముద్దుబిడ్డగా పెరిగి, ఆండాళ్గా అందరి హృదయాలనూ దోచుకుంది. శ్రుతి, స్మృతుల మూలార్థాన్ని తేట తేట పదాలతో తమిళంలో పాశురాలుగా పాడి, ధనుర్మాస (శ్రీ) వ్రతాన్ని ఆచరించింది.

ఆనాడు గోపికలు అనంత శక్తిస్వరూపుడైన శ్రీకృష్ణుణ్ణి ‘ప్రియమైన’ చెలికాడు అనే దృష్టితో ఆరాధించారు. ఆయనను పొందగలిగారు. అదే దృష్టితో నారాయణుణ్ణి గోదాదేవి ఆరాధించింది. ఆమె శ్రీకృష్ణుణ్ణి ప్రియునిగా భావించి, నాయికా భావంతో శ్రీరంగనాయికగా ప్రకటితమైన మహిత ప్రేమమూర్తి.

వైష్ణవ సాంప్రదాయం ప్రకారం శ్రీ ఆండాళ్ తమిలనాటి శ్రీవిల్లిపుత్తూర్ లోని వటపత్రశాయి మందిర తులసి వనంలో కలియుగ ఆది లో అనగా 93 సంవత్సరం లో అవతరించినది. ఎలాగైతె జనక మహారాజుకి సీతాదేవి లభించినదో, విష్ణుచిత్తులవారికి (పెరియాల్వార్) శ్రీవిల్లిపుత్తూర్ నందనవనంలో ఆండాళ్ ఒక తులసి చెట్టు వద్ద లభించింది. తమిలంలో కోదై అనగా తులసి మాల అని అర్థం.. కాబట్టి తండ్రి ఆమెను కోదా అని పిలిచేవారు. క్రమేపి ఆపేరే గోదా గామారింది. తండ్రిపెంపకం లో ఆమె అత్యంతమైన కృష్ణ భక్తి తో పెరిగింది.

విష్ణుచిత్తులవారు ప్రతి రోజు తులసి మాలను తయారుచేసి ఒకబుట్టలో ఉంచి, తిరిగి తన కర్యక్రమాలు పూర్తి చేసుకొని ఆ మాలను దేవాలయానికి తీసుకొనివెళ్ళి వటపత్రశాయి మూర్తికి సమర్పించేవాడు. తండ్రిగారికి తెలియకుండా ఆమె రోజు ఆ మాలను దరించి తాను భగవంతున్ని వివాహము ఆడటానికి సరిపోవునా అని అద్దంలో చూసుకొని మురిసేది.

కొద్దిరోజులకు తండ్రిగార్కి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా, గోదా ఆ మాలను దరించినదని గమనించి ఆమెను కోపించి, తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు. ఆశ్చర్యంగా ఆరోజు స్వప్నం లో స్వామి కనిపించి ఈరోజు తులసి మాలని ఎందుకు సమర్పించలేదని అడిగుతారు.. తనకు భక్తులు తాకిన భహుమతులంటే ఇష్టం అని చెబుతారు.

ఒక్కసారిగా విష్ణుచిత్తులవారు గోదా ఒక కారణ జన్మురాలని గమనించి, నీవు మమ్మల్ని కాపాడటానికి వచ్చినావమ్మా అంటూ ఆండాళ్ అని పిలవటం మోదలుపెట్టాడు. ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చినది అని అర్థం.

అప్పటినుండి ప్రతిరోజు ఆండాళ్ దరించిన తులసిమాలనే స్వామికి సమర్పించేవాడు. గోదాదేవికి పెళ్ళి వయసు రాగానే తండ్రి వరునికై చింతించెను, కాని ఆమె కృష్ణున్ని మాత్రమే వివాహమాడుతానని పంతంతో చెప్పెను. కాని తండ్రి గారు కృష్ణుడు ఉండేది ద్వాపరంలో నందగోకులమనే ప్రాంతము అని అది చాలదూరము, కాలము కూడా వేరు అని చెప్పెను.

తాను కృష్ణుడిని కేవలం అర్చామూర్తిగానే చూడవచ్చని చెప్పెను. తండ్రిగారు వివిద దివ్యక్షేత్రాలలోని ఆయా మూర్తుల కళ్యాణగుణగణాలను కీర్తించెను. తద్వారా గోదాదేవి శ్రీరంగం లో వేంచేసి ఉన్న రంగనాయకులని వరునిగా తలచెను. శ్రీరంగనాథున్ని వివాహమాడుటకై తాను “తిరుప్పావై” మరియు “నాచియార్ తిరుమొఱ్ఱి” అనే దివ్యప్రభందాలను పాడెను.

విష్ణుచిత్తులవారికి శ్రీరంగనాథులవారు మళ్లీ స్వప్నంలో కనిపించి, నీ కుమర్తెను తనకిచ్చి వివాహం చేయటానికి చింతించవద్దని చెప్పెను, ఆమె ఎవరో కాదు భూదేవేనని చెప్పెను. అదేవిదముగా శ్రీరంగంలోని దేవాలయ పెద్దలకు కూడా స్వప్నంలో కనిపించి తన వివాహమునకై శ్రీవిల్లిపుత్తుర్ నుండి గోదాదేవిని పల్లకీలో తెమ్మని చెప్పెను. తద్వార రాజు వల్లభ దేవుని తో పాటు అందరు కలిసి గోదాదేవిని రంగనాథుని వద్దకు తెచ్చిరి. ఆమె ఆ రంగనాథున్ని వివాహమాడి సన్నిధిలో కలిసిపోయినది.

నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకుంటుంది గోదాదేవి. చివరి పాశురంలో ఫలశృతి చెబుతూ ఎవరైతే ఈ పాశురాలు ఎవరైతే గానం చేస్తారో వారికి భగవంతుడి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందని చెబుతుంది. ఆళ్వారులు పాడిన నాలాయిర ప్రబంధంలో అంటే 4000 పాశురాలలో గోదాదేవి పాడిన 30 పాశురాలకు అతి విశిష్ట స్థానం ఉంది. మార్గళి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం 30 పాశురాలు రోజుకొకటి చొప్పున పారాయణం చేస్తారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this