Ajaz Patel: భారత్‌లో పుట్టాడు.. న్యూజిలాండ్ తరపున...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Ajaz Patel: భారత్‌లో పుట్టాడు.. న్యూజిలాండ్ తరపున ఆడాడు.. 10 వికెట్లతో టీమిండియా నడ్డి విరిచాడు..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 టెస్టు క్రికెట్‌లో 5 వికెట్లు తీయడం సర్వసాధారణం. అదే రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 10 వికెట్లు తీయడం.. ఇప్పుడు స్పిన్నర్స్‌కు ఇదొక ఆనవాయితీగా మారింది. 

అయితే ఒక టెస్ట్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీస్తే.. ఆ తీసిన బౌలర్ తోపు అని చెప్పాలి. ఎందుకంటే.! టెస్టు క్రికెట్‌లో మరో సంచలనం నమోదైంది. న్యూజిలాండ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టి రికార్డు సృష్టించాడు. 147 ఏళ్ల టెస్టు క్రికెట్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టడం ఇది మూడోసారి.

గతంలో జిమ్ లేకర్, అనిల్ కుంబ్లేలు ఈ ఘనత సాధించగా.. తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అజాజ్ పటేల్ ఆ జాబితాలో చేరాడు. జూలై 1956 జూలైలో ఇంగ్లాండ్ బౌలర్ లేకర్ ఆస్ట్రేలియాపై 53 పరుగులకు 10 వికెట్లు తీశాడు. అలాగే ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా మైదానంలో పాకిస్తాన్‌పై ఫిబ్రవరి 1999లో కుంబ్లే 10 వికెట్లు పడగొట్టగా.. ఇప్పుడు అజాజ్ పటేల్ 119 పరుగులకు 10 వికెట్లు తీశాడు. ఇక ఈ అజాజ్ పటేల్ గురించి ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. మన భారతదేశంలోనే అతడు పుట్టింది.

ఇదిలా ఉంటే.. అజాజ్ పటేల్.. విదేశీ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు తీసిన తొలి బౌలర్ కాగా.. జిమ్ లేకర్(మాంచెస్టర్), అనిల్ కుంబ్లే(ఢిల్లీ) స్వదేశీ పిచ్‌లపైనే ఈ ఫీట్ అందుకున్నారు. అజాజ్ పటేల్‌కు ముంబైతో అనుబంధం ఉంది. అతడు 21 అక్టోబర్ 1988న ముంబైలోనే జన్మించాడు. ఇక అతడికి ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు, అజాజ్ కుటుంబం న్యూజిలాండ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్లీ తన సొంత గడ్డపైనే 10 వికెట్లు తీసి రికార్డు సృష్టించాడు. ఇతడు సెలవుల్లో ఇండియాకు వచ్చి ముంబై ఇండియన్స్ తరపున నెట్ బౌలర్‌గా చేశాడు.

మొదటి నుంచి టీమిండియాకు తంటాలు..

కివీస్ బౌలర్ అజాజ్ పటేల్ మొదటి నుంచి టీమిండియాను తంటాలు పెట్టాడు. దానితో పాటు అదృష్టం కూడా తోడవ్వడంతో రికార్డు సృష్టించాడు. మొదటి రోజు గిల్‌ను అవుట్ చేసే అవకాశం వచ్చినా.. టామ్ బ్లండిల్ ఆ క్యాచ్ వదిలేశాడు. అయితే ఆ తర్వాత బంతికే గిల్ పెవిలియన్ చేరగా.. వెనువెంటనే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని అజాజ్ ఔట్ చేశాడు. ఇలా తొలి రోజు నాలుగు వికెట్లు దక్కించుకున్న అజాజ్.. రెండో రోజు తొలి సెషన్‌లోనే మిగతా ఆరు వికెట్లను రాబట్టాడు. తద్వారా 47.5 ఓవర్లలో 19 మెయిడిన్లు వేయడమే కాకుండా 119 పరుగులిచ్చి 10 వికెట్లు తీశాడు.

ajaz patel: భారత్‌లో పుట్టాడు.. న్యూజిలాండ్ తరపున ఆడాడు.. 10 వికెట్లతో టీమిండియా నడ్డి విరిచాడు..


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this