WHO: పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. ఇప్పటి వరకు...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

WHO: పుట్టుకొస్తున్న కొత్త వేరియంట్లు.. ఇప్పటి వరకు బయటపడ్డ వేరియంట్లకు డబ్ల్యూహెచ్‌వో ఎలాంటి పేర్లు పెట్టిందంటే!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 New Variant Virus: గత ఏడాదికిపైగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికించి ప్రస్తుతం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుని ఎవరి పనులు వారు చేసుకుంటున్న జనాలకు మరో కొత్త వేరియంట్‌ ఆందోళన కలిగిస్తోంది. దక్షిణాఫ్రికాలో బయట పడిన B.1.1.529 అనే ఈ వేరియెంట్‌కు ఓమ్రికాన్ అనే నామకరణం చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పటికే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా నుంచి పూర్తి స్థాయిలో బయటపడకముందే ఈ దక్షిణాఫ్రికా వేరియంట్‌ మరోసారి కలకలం సృష్టిస్తోంది. ఇటీవల కోవిడ్‌ డెల్టా వేరియంట్‌ భారత్‌ను ఎంత భయాందోళనకు గురి చేసిందో అందరికి తెలిసిందే. ఈ కొత్త వేరియంట్‌ ఇప్పుడు దానికి మించి వ్యాప్తి చెందే అవకాశాలు ఉండటంతో మరింత భయాందోళన వ్యక్తం అవుతోంది.

ఒమిక్రాన్‌గా పిలువబడే ఈ కొత్త వేరియంట్‌ వైరస్‌.. మరింత వేగంగా వ్యాప్తించే అవకాశాలున్నాయని నిపుణులు గుర్తించారు. ఇప్పటికే ఐదు దేశాల్లో ఈ వేరియంట్‌కు సంబంధించిన కేసులను గుర్తించారు. అయితే ఇప్పటికే గుర్తించిన వేరియంట్లకు ప్రపంచ ఆరోగ్య సంస్థ పలు పేర్లును పెట్టింది.  అవి.. 1. ఆల్ఫా, 2. బీటా, 3. గామ, 4. డెల్టా, 5. ఈటా, 6. లోటా, 7. కప్పా, 8. లాంబ్డా వేరియంట్లకు నామకరణం చేశారు నిపుణులు.  ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో బయటపడిన వేరియంట్‌ ఒమిక్రాన్‌ తొమ్మిదోవది.

ఇక ఇప్పటి వరకు బయటపడిన ఎనిమిది వేరియంట్ల గురించి పరిశీలిస్తే.. 2020 సెప్టెంబర్‌లో మొదటిసారిగా యూకేలో ఆల్ఫా వేరియంట్‌ను గుర్తించారు. ఇక బీటా వేరియంట్‌..  దీనిని 2020 మే నెలలో దక్షిణాఫ్రికాలో గుర్తించారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ వేరియంట్‌ తీవ్రంగా వ్యాపించింది. అలాగే కప్పా వేరియంట్‌.. దీనిని 2020 అక్టోబర్‌లో భారత్‌లో గుర్తించారు. ఈ వేరియంట్‌ 55 దేశాల్లో బయటపడింది. ఇక లాంబ్డా అనే వేరియంట్‌ డిసెంబర్‌ 2020లో పెరూలో మొదటిసారిగా బయటపడింది. ఈ వేరియంట్‌ నాలుగు నెలల్లోపు 41 దేశాలకుపైగా వ్యాప్తించింది. అలాగే బ్రేజిల్‌లో 2020 నవంబర్‌ నెలలో గామా అనే వేరియంట్‌ను గుర్తించారు. ఇది దక్షిణ అమెరికాలో భారీగా వ్యాపించింది. ఇక డెల్టా వేరియంట్‌.. అక్టోబర్‌లో మొదటిసారిగా గుర్తించారు. ఆసియా, యూరప్‌ దేశాలలో విజృంభించింది. ఆల్ఫా వేరియంట్‌ కంటే ఇది 60 శాతం వేగంగా వ్యాప్తించే గుణం ఉన్నట్లు నిపుణలు గుర్తించారు. ఇక ఈటా వేరియంట్‌ అనే వైరస్‌ను డిసెంబర్‌ నెలలో యూకేలో మొదటిసారిగా గుర్తించారు. ఈ వేరియంట్‌ దాదాపు 72 దేశాలకు విస్తరించింది. అలాగే లోటా వేరియంట్‌ కూడా న్యూయార్క్‌లో 2020లో బయపపడింది. ఈ వేరియంట్‌ బయటపడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఇలా ఇప్పటి వరకు 9 వేరియంట్లను గుర్తించి వాటికి ఈ పేర్లను పెట్టింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this