South Africa: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

South Africa: దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో భారీగా కరోనా కేసులు.. ఆందోళన కలిగిస్తున్న కొత్త వేరియంట్‌..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 South Africa: దక్షిణాఫ్రికాలో కొత్త వేరియంట్‌ కలకలం సృష్టిస్తోంది. గత ఏడాదికిపైగా కరోనా మహహ్మారి తీవ్ర స్థాయిలో విజృంభించి ప్రస్తుతుం తగ్గుముఖం పట్టడంతో ఊపిరి పీల్చుకుంటున్న జనాలకు మరో వేరియంట్‌ ఆందోళనకు గురి చేస్తోంది. దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఈ వేరియంట్‌ జమిక్రాన్‌ ప్రపంచాన్ని మరోసారి వణికిస్తోంది. ఇప్పటికే అప్రమత్తమైన దేశాలు.. మళ్లీ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి. దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాల్లో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ విమానాల్లో పెద్ద సంఖ్యలో కరోనా కేసులు బయటపడటం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ కొత్త వేరియంట్‌ బయటపడగానే నెదర్లాండ్స్‌ ప్రభుత్వం ఆ దేశం నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించింది. ప్రయాణికులకు ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు, క్వారంటైన్‌ తప్పనిసరి చేసింది.

ఈ నేపథ్యంలో శుక్రవారం దక్షిణాఫ్రికా నుంచి రెండు విమానాలు అమ్‌స్టర్‌డామ్‌కు చేరుకోగా, అందులో ప్రయాణికులకు పరీక్షలు చేయగా, 61 మందికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు డచ్‌ ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. అయితే వీరికి సోకింది ఒమిక్రాన్‌ వేరియంటా కాదా అనేది ఇంక నిర్ధారించాల్సి ఉంది. వీరందరి రక్తనామూనాలను సేకరించి జీనోమ్‌ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు వెల్లడించారు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన రెండు విమానాల్లో 600 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరందరికి పరీక్షలు నిర్వహించగా, 61 మందికి మాత్రమే కోవిడ్‌ సోకినట్లు రిపోర్టు వచ్చాయి. మిగతా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. దీంతో మరిన్ని కేసులు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this