Shiva Shankar Master : సినీ పరిశ్రమలో...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

Shiva Shankar Master : సినీ పరిశ్రమలో విషాదం.. శివశంకర్ మాస్టర్ కన్నుమూత..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 శివశంకర్ మాస్టర్ అనారోగ్యంతో కన్నుమూశారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. ఇటీవల కరోనా బారిన పడిన దగ్గర నుంచి మాస్టర్‌ ఆరోగ్యం విషమించిచడంతో ఏఐజీ ఆస్పత్రికి తరలించారు. ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ 75శాతం ఇనెఫెక్షన్ సోకడంతో డాక్టర్లు ఎమర్జెన్సీ విభాగంలో చికిత్స అందించారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్య, పెద్ద కుమారుడికి కూడా కరోనా సోకింది. ఇక మాస్టర్ చిన్న కుమారుడు అజయ్ కృష్ణ తన తండ్రి, అన్న, అమ్మ బాగోగులు చూసుకుంటూ వచ్చారు. ఆర్థిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో.. టాలీవుడ్, కోలివుడ్ డ్యాన్స్ మాస్టర్స్… హీరోలు.. మాస్టర్ కుటుంబానికి సాయం చేశారు. ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకుని.. మెరుగైన చికిత్స అందించాలని కోరారు. శివశంకర్ 8 గంటల సమయంలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. మాస్టర్ కన్నుమూయడంతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇప్పటికే శివశంకర్ మాస్టర్ కోలుకోవాలని సినిమాతారలు ప్రార్ధనలు చేశారు. కానీ వారి ప్రార్ధనలు ఫలించలేదు. కొద్దీ సేపటి క్రితం ఆయన తుది శ్వస విడిచారు. సోనూసూద్, హీరో ధనుష్, మెగాస్టార్ చిరంజీవి, మంచు విష్ణు, లారెన్స్ శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ఆర్ధిక సాయం చేశారు. శివ శంకర్ మాస్టర్ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారని తెలిసి సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this