Sunday, January 18, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Rice Card All Links: రైస్...

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Rice Card All Links: రైస్ కార్డు ముఖ్యమైన లింక్స్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ పోస్ట్ ఈ క్రింది అంశాలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది.

  • ఆధార్ నెంబర్ తో పాత రేషన్ కార్డ్ నెంబర్ తెలుసుకునే లింక్
  • పాత రేషన్ కార్డ్ నెంబర్ తో కొత్త నెంబర్ తెలుసుకునే లింక్
  • RICE CARD ACTIVE (OR) INACTIVE STATUS CHECK
  • మీ రైస్ కార్డ్ యాక్టివ్ గా ఉందో లేదో ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి తెలుసుకోగలరు
  • రైస్ కార్డు లో ఎంతమంది ఉన్నారు, రైస్ కార్డ్ స్టేటస్ తెలుసుకోండి

రైస్ కార్డు ekyc స్టేషన్ ను ఫోన్ లో చెక్ చేసే విధానం :

Step1:కింద ఇచ్చిన లింక్ ను ఫోన్ లో ఓపెన్ చేసి https://epds2.ap.gov.in/epdsAP/epds మూడు లైన్ లు పై క్లిక్ చెయ్యాలి.

Step2: Dash Board ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి

Step3: ” EPDS APPLICATION SEARCH ” అనే ఆప్షన్ ను క్లిక్ చెయ్యాలి.

Step4:ఇక్కడ Enter Applicatioon ID దగ్గర మీ రేషన్ కార్డు నంబర్ ను ఎంటర్ చేయండి.తరువాత ENTER CAPTCHA దగ్గర దాని పక్కన ఉన్న కోడ్ ని ఎంటర్ చేసి SEARCH ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Step 5 : తరువాత దాని పక్కనే eKYC స్టేటస్ ఆప్షన్ లో Success అని వుంటే eKYC కంప్లీట్ అయినది అని , చైల్డ్ డిక్లరేషన్ పెట్టింటే ‘Parental Authentication’అని ఈ కేవైసీ పెండింగ్ ఉంటే pending అని చూపిస్తుంది.

రైస్ కార్డు అడ్రస్ , సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ తెలుసుకోటానికి :

1. మొబైల్ లేదా PC లేదా ట్యాబు లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి “epos” ఎంటర్ చేసి అని సెర్చ్ చెయ్యాలి. అలా చేసాక చాలా రిజల్ట్స్ వస్తాయి. అందులో https://epos.ap.gov.in ను ఓపెన్ చెయ్యాలి.

2. పైన చూపిస్తున్న లిస్ట్ లలో “MIS” పై క్లిక్ చెయ్యాలి. అందులో ఉన్న వాటిలో “RATION CARD / RICE CARD SEARCH” ను పై క్లిక్ చెయ్యాలి.

3. RC Number అని చూపిస్తున్న దగ్గర రేషన్ కార్డు లేదా రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి లేదా పక్కన పేజీ లో ఎక్కడ అయినా ఎంటర్ చెయ్యాలి.

4. వెంటనే కార్డు ఉన్నటు వంటి అడ్రస్, సచివాలయం అడ్రస్, పాత రేషన్ కార్డు నెంబర్, మొత్తం కార్డులోని వ్యక్తుల పేర్లు, వ్యక్తుల స్టేటస్, కార్డు స్టేటస్ చూపిస్తుంది.

5. Transaction History అనే ఆప్షన్ లో కార్డు ద్వారా తీసుకున్న రేషన్ వివరాలు , రేషన్ డిపో నెంబర్, ఎవరి బయోమెట్రిక్ ద్వారా తీసుకున్నారో ఆ వివరలు అన్ని ఉంటాయి.

రైస్ కార్డు నందు ఉండే యూనిట్ ల మధ్య సంబందాలు, వయసులు, ఆధార్ సీడింగ్ స్టేటస్, కార్డులో ఆక్టివ్ గా ఉన్నారా లేదా తెలుసుకోటానికి :

1. 1. మొబైల్ లేదా PC లేదా ట్యాబు లో ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి “aepos” ఎంటర్ చేసి అని సెర్చ్ చెయ్యాలి. అలా చేసాక చాలా రిజల్ట్స్ వస్తాయి. అందులో https://aepos.ap.gov.in ను ఓపెన్ చెయ్యాలి.

2. హోమ్ పేజీ లో Reports సెక్షన్లో RC Details అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.

3. RC నెంబర్ దగ్గర రైస్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి. వెంటనే పైన తెలిపిన వివరాలు అన్ని చూపిస్తుంది.

పై సమాచారం అంతటికి ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు .

T నెంబర్ తో రైస్ కార్డు సెర్చ్ చెయ్యు విధానం :

Step 1 : గూగుల్ లో Epdsap అని సెర్చ్ చెయ్యండి.

Step 2 : https://epds2.ap.gov.in

అని చూపిస్తున్న లింక్ పై క్లిక్ చెయ్యండి

Step 3 : మొబైల్ లో అయితే మూడు లైన్ ల పై క్లిక్ చెయ్యాలి రెండవ “DASHBOARD” అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి. సిస్టం లో అయితే డైరెక్ట్ గా మెనూ బార్ లో “DASHBOARD” పై క్లిక్ చెయ్యాలి

Step 4 : Ration Card సెక్షన్ లో “EPDS APPLICATION SEARCH” పై క్లిక్ చెయ్యాలి.

Step 5 : Enter Application Id Daggara T తో స్టార్ట్ అయ్యే అప్లికేషన్ ID ను ఎంటర్ చెయ్యాలి. పక్కన చూపిస్తున్న CAPTCHA కోడ్ ను ఎంటర్ చేయాలి. SEARCH పై క్లిక్ చెయ్యాలి.

Step 6 : కింద చూపిస్తున్న విధం గా T నెంబర్ పక్కన రైస్ కార్డు నెంబర్ చూపిస్తుంది.

రైస్ కార్డు సరెండర్ అయ్యిందో లేదో తెలుసుకోటానికి :

Step 1 : గూగుల్ లో epos అని టైపు చేసి సెర్చ్ చెయ్యాలి

Step 2 : https://epos.ap.gov.in అని చూపిస్తున్న లాగిన్ పై క్లిక్ చెయ్యాలి. ఒకవేళ లాగిన్ పేజీ ఓపెన్ అయితే https://epos.ap.gov.in ను సెర్చ్ బార్ లో సెర్చ్ చెయ్యాలి.

Step 3 : MIS అనే ఆప్షన్ పై క్లిక్ చెయ్యాలి.

Step 4 : Ration Card / Rice Card Search దగ్గర రైస్ కార్డు లేదా రేషన్ కార్డు నెంబర్ ఎంటర్ చెయ్యాలి. సిస్టం లో అయితే Enter ను ప్రెస్ చెయ్యాలి. మొబైల్ లో అయితే పక్కన ఎక్కడ అయినా tap / క్లిక్ చెయ్యాలి.

Step 5 : కింద చూపించిన విధం గా RC స్టేటస్ వద్ద సరెండర్ అని చూపిస్తే కార్డు సరెండర్ చేసినట్టు అర్థం. అదే Active అని వస్తే కార్డు యాక్టీవ్ లో ఉన్నట్టు అర్థం, వారికి రేషన్ వస్తుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this