No PRC Report: పీఆర్సీ నివేదిక ఇప్పుడే...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

No PRC Report: పీఆర్సీ నివేదిక ఇప్పుడే ఇచ్చేది లేదు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • ఉద్యోగ సంఘాలకు  స్పష్టం చేసిన   శశి భూషణ్ కుమార్

పిఆర్సి నివేదికను తక్షణం బయట పెట్టేది లేదని, రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులు విభాగం కార్యదర్శి శశిభూషణ్ కుమార్ పేర్కొన్నారు.  సచివాలయంలో బుధవారం ఆందోళన నిర్వహించిన ఏపీ ఎన్జీవో నాయకులు, అమరావతి జేఏసీ నాయకులను ఆయన గురువారం పిలిచి మాట్లాడారు.  పీఆర్సీ నివేదిక విషయంలో ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తమకు చెప్పినట్లు ఉద్యోగ సంఘ నేతలు మీడియాకు వెల్లడించారు.  శశి భూషణ్ కుమార్ తో సమావేశం అనంతరం  ఎన్జీవో నేత బండి శ్రీనివాసరావు, అమరావతి జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు సచివాలయంలో మీడియాతో మాట్లాడారు.  పిఆర్సి నివేదికను ప్రభుత్వం ఎందుకు బయట పెట్టడం  లేదో తమకు తెలియడం లేదన్నారు. అసలు పిఆర్సి అమలు చేసే ఉద్దేశం  ప్రభుత్వానికి ఉందా లేదా  అని వారు ప్రశ్నించారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సభ్య సంఘాల వివరాలు ఇవ్వాలని కూడా కోరినట్లు  బొప్పరాజు,  బండి శ్రీనివాసరావు తెలిపారు. పీఆర్సీ నివేదిక విషయంలో ఇంకా చర్చలు కొనసాగుతున్నాయని  శశి భూషణ్ కుమార్ వెల్లడించినట్లు  వారు చెప్పారు.  గవర్నమెంట్   ఉద్యోగుల ఫెడరేషన్ నేత వెంకట్ రామ్ రెడ్డి ని కూడా  తమతో కలవాలని కోరినట్లు చెప్పారు.

బొప్పరాజు  ఏం మాట్లాడారో  ఆ వివరాలు…

  • పీఆర్సీ నివేదికను ప్రభుత్వం ఎందుకు దాచిపెడుతుందో అర్ధం కావడం లేదు.
  • మా డిమాండ్లకు చోటుకల్పించారో లేదో  తెలియాలి.
  • పీఆర్సీ అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి ఉందో లేదో స్పష్టం చేయాలి.
  • రేపటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో మాకు పి ఆర్ సి  అమలు  డిమాండే ముఖ్యాంశం


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this