New Rules From 1 December: డిసెంబర్...

AP District Wise Cadre Strength and Working Strength – G.O.Ms.No.156

ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి Finance Department ద్వారా G.O.Ms.No.156, తేదీ...

AP G.O. Ms. No. 33: Major Amendments to AP Educational Service Rules 2026

The Government of Andhra Pradesh has issued a landmark...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

New Rules From 1 December: డిసెంబర్ 1 వచ్చేస్తోంది.. మీ ఖర్చులు తగ్గనున్నాయి.. ఎందుకో తెలుసా..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 New Rules From 1 December: డిసెంబర్ 1 నుంచి కొన్ని రూల్స్ మారబోతున్నాయి. ఈ ప్రభావం మీ పాకెట్‌ మనీ పై పడనుంది.  కొత్తగా LPG సిలిండర్ ధరలు, UAN- ఆధార్‌ను లింక్ చేయడానికి గడువుతోబాటు SBI క్రెడిట్ కార్డ్, హోమ్‌లోన్‌తో EMIలో కొనుగోలు చేయడం చాలా ఖరీదైనదిగా మానుంది. ఎల్‌పిజి సిలిండర్ ధరలను ప్రకటించడంతో బ్యాంకింగ్, పెన్షన్‌కు సంబంధించిన కొన్ని నిబంధనలు కూడా మారబోతున్నాయి. అయితే డిసెంబర్ 1 నుంచి ఎల్పీజీ ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.

EPFO ఇప్పటికే UAN- ఆధార్‌లను లింక్ చేయడానికి గడువును నవంబర్ 30 వరకు పొడిగించింది కేంద్రం. అందుతున్న సమాచారం ప్రకారం సమయం పెంచే అవకాశం లేదు. ఈ సందర్భంలో ఇంకా UAN-ఆధార్‌కు లింక్ చేయని వారు డిసెంబర్ 1 లోపు పనిని పూర్తి చేయాలి. లేదంటే పెద్ద నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. వాస్తవానికి గడువులోపు UAN-ఆధార్‌ను లింక్ చేయకపోతే  చందాదారుల ఖాతాలకు PF జమ చేయబడదు. చందాదారులు కూడా PF ఖాతా నుండి విత్‌డ్రా చేయలేరు.

నవంబర్ 30లోగా యూఏఎన్-ఆధార్ లింక్ చేసుకోని వారు భారీగా నష్టపోయే అవకాశం ఉంది. EPFO కూడా ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI) కోసం UAN-ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అలా చేయడంలో విఫలమైతే ఉద్యోగికి ప్రీమియం చెల్లించకపోవడమే కాకుండా రూ. 7 లక్షల వరకు బీమా రక్షణ కోల్పోతారు.

SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారుల కోసం ఇది డిసెంబర్ నుండి మారబోతోంది. SBI క్రెడిట్ కార్డ్‌తో EMIలో కొనుగోలు చేయడం మరింత ఖరీదైనదిగా మారుతుంది. ఇప్పటి వరకు SBI కార్డ్‌లపై వడ్డీ మాత్రమే వసూలు చేయబడింది. కానీ ఇప్పుడు EMIలో కొనుగోళ్లకు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. ఇది SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారుల జేబులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది.

గృహ రుణాల విషయానికి వస్తే.. చాలా బ్యాంకులు, ఆర్థిక సంస్థలు పండుగ సీజన్‌లో గృహ రుణాలను అందిస్తున్నాయి. ఈ ఆఫర్‌లు సరసమైన వడ్డీ రేట్ల నుండి ప్రాసెసింగ్ ఫీజు మినహాయింపుల వరకు ఉంటాయి. అయితే, చాలా బ్యాంక్ ఆఫర్‌లు డిసెంబర్ 31, 2021 వరకు చెల్లుబాటులో ఉంటాయి. అయితే ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ ఆఫర్ గడువు ఈ నెలతో ముగుస్తుంది. వాస్తవానికి కంపెనీ వినియోగదారులకు నవంబర్ 30తో ముగుస్తోంది. అంటే రూ.2 కోట్ల లోపు రుణాలపై 6.66 శాతం గృహ రుణం పొందడానికి ఛాన్స్ ఉంది.

ప్రభుత్వ పెన్షనర్లు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించడానికి చివరి తేదీ నవంబర్ 30 అని తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఈ గడువులోపు జీవిత ధృవీకరణ పత్రం సమర్పించలేని ప్రభుత్వ పింఛనుదారులకు ఇకపై పింఛను అందదు. EPFO ఇటీవల చేసిన ట్వీట్ ప్రకారం.. ప్రభుత్వ పెన్షనర్లు జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి నవంబర్ 30 వరకు గడువు ఉంది. ఇది ఒక సంవత్సరం పాటు చెల్లుబాటు అవుతుంది. ఇంట్లో కూర్చొని ఈ పనిని డిజిటల్‌గా చేసుకోవచ్చు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this