Monday, January 19, 2026
Duniya360 - We will update latest news around the world. Duniya360.com is leading digital news website in Telugu.
Elon Musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.....

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు | అక్షరాలు, సంఖ్యలు, పట్టికలు – student learning tools

పిల్లల కోసం ఇంటరాక్టివ్ లెర్నింగ్ యాప్‌లు – Duniya360 student learning...

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రాథమిక తరగతుల కోసం సమగ్ర మార్గదర్శి

FLN 75 Days Action Plan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష (APTET) 2025: సంపూర్ణ మార్గదర్శకాలు

పరిచయం:ఆంధ్రప్రదేశ్ప్రభుత్వం, రాష్ట్రంలో తరగతి 1 నుండి 8 వరకు ఉపాధ్యాయులుగా నియమితులవ్వాలనుకునే...

Elon Musk: భారతీయుల ప్రతిభతోనే అమెరికా అభివృద్ధి.. ఎలన్ మస్క్ సంచలన ట్విట్..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Elon Musk on Parag Agrawal: ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ట్విట్టర్‌.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా భారత సంతతి టెక్కీ పరాగ్ అగర్వాల్ నియామకమైన సంగతి తెలిసిందే. సీఈ‌వోగా ఉన్న ట్విట్టర్‌ సహ వ్యవ‌స్థా‌ప‌కుడు జాక్‌ డోర్సే సోమ‌వారం పదవీ నుంచి దిగి‌పో‌వ‌డంతో ఆయన స్థానంలో చీఫ్‌ టెక్ని‌కల్‌ ఆఫీ‌స‌ర్‌గా పని‌చే‌స్తున్న పరాగ్‌ అగ‌ర్వా‌ల్‌ను సంస్థ బోర్డు ఏక‌గ్రీ‌వంగా నియమించింది. 2006 నుంచి డోర్సే ట్విట్టర్‌ సార‌థిగా కొన‌సా‌గు‌తూ వస్తున్నారు. అయితే.. ట్విట్టర్ సీఈఓగా భారత వ్యక్తిని నియమించడంపై టెస్లా బిలియనీర్ ఎలోన్ మస్క్ స్పందించారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేశారు. భారతీయ ప్రతిభ నుంచి అమెరికా చాలా ప్రయోజనం పొందింది అంటూ అని టెస్లా బాస్ మస్క్ ట్వీట్ చేశారు.

గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబిఎమ్ వంటి ప్రపంచంలోని అగ్రశ్రేణి టెక్ కంపెనీలకు నాయకత్వం వహిస్తున్న భారతీయ సంతతి వ్యక్తులపై పాట్రిక్ కొల్లిసన్ చేసిన ఓ ట్వీట్‌కు ఆయన సమాధానమిచ్చారు. గూగుల్-పెరెంట్ కంపెనీ ఆల్ఫాబెట్ CEOగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ CEOగా సత్య నాదెళ్ల సేవలందిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. అలాంటి ప్రముఖ US టెక్ సంస్థకు నాయకత్వం వహించనున్న పరాగ్ అగర్వాల్ కూడా అత్యంత ప్రతిభావంతుడని కొనియాడారు. కాగా.. ఎలన్ మస్క్ ట్విట్‌పై చాలామంది స్పందిస్తూ రీట్విట్ చేస్తున్నారు. వారంతా అత్యంత ప్రతిభావంతులని కొనియాడుతున్నారు.

ఇప్పటికే గూగుల్ సీఈఓగా సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓగా సత్య నాదెళ్ల, అడోబ్ సీఈఓగా శాంతను నారాయణ్, ఐబీఎంకు అరవింద్ కృష్ణ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి సరసన పరాగ్ అగర్వాల్ చేరారు. అగర్వాల్ 2011లో కంపెనీలో చేరారు. అక్టోబర్ 2017 నుంచి చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్‌గా పనిచేశారు. ఆయన స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి కంప్యూటర్ సైన్స్‌లో PhD, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-బాంబే నుండి కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.

Google, Microsoft, Adobe, IBM, Palo Alto Networks, and now Twitter run by CEOs who grew up in India. Wonderful to watch the amazing success of Indians in the technology world and a good reminder of the opportunity America offers to immigrants. 🇮🇳🇺🇸 (Congrats, @paraga!)

— Patrick Collison (@patrickc) November 29, 2021


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this