AP PRC Fight: పీఆర్‌సీ సాధన కోసం...

SMC Elections 2026 Proformas: AP Teachers 1-Click PDF Generator Tools

SMC Elections 2026 Proformas: ఏపీ ఉపాధ్యాయుల కోసం 1-క్లిక్ ఆటోమేటిక్...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP PRC Fight: పీఆర్‌సీ సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాల పోరుబాట.. ఉద్యమ కార్యాచరణ ప్రకటన!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 AP Govt. Employees PRC Fight: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు సర్కార్ సమర శంఖం పూరిస్తున్నారు. PRC అమలుపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల సమస్యల విషయంలో రాజీ ప్రసక్తే లేదని స్పష్టం చేశాయి ఉద్యోగ సంఘాలు. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాల్సి వస్తోందని స్పష్టం చేశాయి.. PRC సాధన కోసం ఏపీ ఉద్యోగ సంఘాలు పోరుబాట పట్టాయి. యాక్షన్‌ ప్లాన్ ప్రకటించాయి. డిసెంబర్ 7 నుంచి జనవరి 6 వరకు వివిధ రూపాల్లో నిరసనలు చేపట్టనున్నట్లు తెలిపాయి. విధిలేని పరిస్థితుల్లోనే ఉద్యమబాట పట్టాల్సి వస్తోందని స్పష్టం చేశాయి. PRC ప్రకటన, CPS రద్దు, ఉద్యోగుల బకాయిలపై సీఎం వైఎస్ జగన్ సర్కార్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.

ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌పై డిసెంబర్‌1న రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇవ్వాలని ప్రభుత్వ సంఘాలు నిర్ణయించాయి. డిసెంబర్‌ 7 నుంచి 10 వరకు అయా ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలుపనున్నారు. 10న భోజన విరామ సమయంలో నిరసన ఉంటుందని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. డిసెంబర్13, 16వ తేదీల్లో అన్ని తాలుకా కేంద్రాల్లో నిరసనలు ధర్నాలు చేపట్టాలని నిర్ణయించారు. 21న అన్ని జిల్లా కేంద్రాల్లో మహాధర్నా ఉంటుంది. 27న విశాఖ, 30న తిరుపతి, జనవరి 3న ఏలూరు, జనవరి 6న ఒంగోలులో ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.

PRC ప్రకటన, CPS రద్దు, ఉద్యోగుల బకాయిలు. ఈ మూడు డిమాండ్స్‌ను ప్రధానంగా తెరపైకి తెచ్చాయి ఎంప్లాయిస్ యూనియన్స్. PRCపై విధించిన డెడ్‌లైన్ ముగియడంతో AP JAC, AP JAC అవరావతి ఉమ్మడి సమావేశం ఏర్పాటుచేసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటించాయి. PRC నివేదికను బయటపెట్టడంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటో అర్థం కావడం లేదన్నారు. ఉద్యోగ సంఘాలకు విలువ లేకుండా చేస్తున్నారని.. ఆర్థిక మంత్రి కూడా అవమానించే విధంగా మాట్లాడారని నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రభుత్వానికి పూర్తిగా సహకరించామని.. అయినా తమపై ఈ విధంగా కక్ష కడుతున్నారని ఆరోపించారు. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌ ముగిసేలోగా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోతే మరోసారి సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this