No Decisions Made in Joint Staff...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Thalliki Vandanam Scheme 2026-27: డేటా పరిశీలనలో ఈ 5 పొరపాట్లు చేయకండి!

Thalliki Vandanam Scheme 2026-27 డేటా పరిశీలనపై పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

SSC Memo Download 2026: AP SSC Short Memos Available Online at BSE.AP.GOV.IN

ఆంధ్రప్రదేశ్ మాధ్యమిక విద్యా బోర్డు విడుదల చేసిన SSC Memo Download...

No Decisions Made in Joint Staff Council Meeting: ఎటూ తేల్చని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 No Results in Joint Staff Council Meeting: ఎటూ తేల్చని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్

అక్టోబర్  29 –   పిఆర్సి నివేదికకు సంబంధించి ఒక పేజీ అధికారిక పత్రం  బయటకు రావడం తప్ప శుక్రవారం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో పెద్దగా ముందడుగు పడలేదు. వేతన సవరణ కమిషన్ 27శాతం  ఫిట్మెంట్ సిఫార్స్ చేసినట్లు అందులో   వివరాలు ఉన్నాయి.ఆంధ్ర ప్రదేశ్ సచివాలయం లో  శుక్రవారం నిర్వహించిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఉద్యోగులకు ఏ విషయంలోనూ  స్పష్టమైన హామీ లభించ  లేదని  కొన్ని ఉద్యోగ సంఘాలు కలిగించాయి.ఎజెండా అంశాలపై చర్చ జరిగినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సమీర్ శర్మ  ఇతమిత్థంగా  ఏది తేల్చి చెప్ప లేదని పేర్కొంటున్నారు. ఒరేయ్ బాబు పీఆర్సీ నివేదిక బయటపెట్టాలని  ఉద్యోగ సంఘాలన్నీ గట్టిగా పట్టుబట్టాయి. సమావేశం అయ్యే లోపు నివేదిక    బయటపెట్టాలని కోరాయి. మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని ఒకసారి, వారం రోజుల్లో నివేదిక ఇస్తామని ఒకసారి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  చెప్పినా నివేదిక విడుదల విషయంలో పూర్తి స్పష్టత ఇవ్వలేదని ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. పీఆర్సీ సిఫార్సుల సంబంధించి ఒక పేజీలో ప్రభుత్వం వివరాలు అందించిందని, 27శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసినట్లు అందులో ఉందని బొప్పరాజు వెంకటేశ్వర్లు వెల్లడించారు. వారం రోజుల్లో పీఆర్సీ నివేదిక బయటపెడతామని సీఎస్ హామీ ఇచ్చినట్లు గవర్నమెంట్ ఉద్యోగుల  ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరిస్తామని  ప్రభుత్వం  హామీ ఇచ్చిందన్నారు. ఎన్జీవో సంఘ ఆధ్వర్యంలో జేఏసీ నేతలు, ఏపీ అమరావతి జేఏసీ నేతలు ఈ సమావేశం పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this