AP JAC & AP JAC అమరావతి...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

AP JAC & AP JAC అమరావతి ఐక్యవేదిక సంయుక్త పత్రికా ప్రకటన..13/10/2021

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

11 వ PRC ప్రక్రియ ప్రారంభించి ఈనెలాఖరు నాటికి పూర్తిచేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ కె ధనంజయరెడ్డి IAS గారు, ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు..

  • హర్షం వ్యక్తం చేసిన JAC ఐక్యవేదిక నాయకులు… – బండి శ్రీనివాసరావు, బొప్పరాజు

న్యూస్ టోన్,  అమరావతి: ది 12/10/2021 న రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చిన మెమొరాండం పై ఈ రోజు ముఖ్యమంత్రి కార్యాలయం పిలుపు మేరకు AP JAC & AP JAC అమరావతీ నాయకులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, జి హృదయరాజు, వై వి రావు, కె వి శివారెడ్డి, జి వి నారాయణరెడ్డి గార్లు చర్చలలో పాల్గొనడమైనది.

* ముఖ్యమంత్రి అదనపు ప్రధాన కార్యదర్శి శ్రీ కె ధనంజయరెడ్డి IAS గారు మరియు ప్రభుత్వ ముఖ్య సలహాదారులు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి గార్లు ఇచ్చిన మెమొరాండం లోని అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల సహకారం మరువలేనిదని, ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని , కరోనా కారణంగా వచ్చిన ఆర్థిక ఇబ్బందుల వలన కొన్ని సమస్యలు ఎదురయ్యాయని వాటిని పరిష్కరిస్తామని తెలియచేశారు.

* ఈ నెల 18 లేదా 19 వ తేదీన అన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి, ఈ నెలాఖరునాటికి  11 వ PRC మంజూరు ప్రక్రియను పూర్తిచేస్తామని చెప్పారు.

* కొన్ని ఇబ్బందులవలన మూడు నెలలుగా కొంతమందికి జీతాలు, పెన్షన్లు జాప్యం జరిగిందని ఇకపై అటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే నెల నుంచి 1 వ తారీఖునే చెల్లింపులు చేస్తామని తెలియచేశారు. ఒక వేళ  ఒకట్రెండు రోజులు జాప్యం జరిగే అవకాశముంటే ముందుగా 1 వ తారీఖు కల్లా పెన్షనర్స్ కు చెల్లింపులు చేస్తామని చెప్పారు. గత నెల ఇంకా జీతాలు, పెన్షన్స్ రానివారికి రేపటి సాయంత్రం లోపు మంజూరు చేస్తామని అన్నారు

* ఉద్యోగుల రావాల్సిన సరండర్ లీవ్, APGLI లోన్స్, GPF లోన్స్, మెడికల్ రీయంబర్స్మెంట్ బిల్లులు, త్వరితగతిన చెల్లింపులు చేస్తామని తెలియచేశారు. అలాగే క్లియర్ కానీ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్లుల వివరాలు కూడా తెలియచేసే విధంగా ఫైనాన్స్ అధికారులకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు.

* CPS రద్దు , కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్, ఔట్సౌర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు పెంపు, DA ల మంజూరు విషయాలను ప్రాధాన్యత క్రమంలో వచ్చే నెలాఖరు నాటికి పూర్తిచేసే విధంగా ప్రక్రియ ప్రారంభిస్తామని తెలియచేశారు.

* జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ఈ నెల 17,18 వ తేదీలలో ఏర్పాటు చేసి ఉద్యోగులకు వున్న సమస్యలపై సంఘాలతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు. 

* ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఎదుర్కొంటున్న మరొక ముఖ్యమైన సమస్య EHS – దానిపై CEO గారు,  హాస్పిటల్ యాజమాన్యాలు మరియు ఉద్యోగ సంఘాల నాయకులతో కలిపి ఒక సంయుక్త సమావేశం నిర్వహించి EHS వలన వస్తున్న సమస్యలు పరిష్కరిస్తామని తెలియచేశారు.

* కోవిడ్ కారణంగా మరణించిన ఉద్యోగ కుటుంబాలకు వెంటనే ఒక *మేళా* లాగా పెట్టి వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కలుగ చేసేవిధంగా అధికారులకు ఆదేశాలు ఇస్తామని తెలియచేశారు.

> జూలై అఖరుతో ముగిసిన మెడికల్ రియంబర్స్మెంట్ గడువును త్వరలో పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని అన్నారు.

> SSC బోర్డులో అక్రమంగా సస్పెండ్ చేసిన 3 ఉద్యోగులను తిరిగి ఉద్యోగంలో కి తీసుకుంటామని తెలిపారు.

> పాఠశాలల్లో, హెల్త్ శాఖల్లో వేదిస్తున్న యాప్స్ లను తగ్గించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

 > నాడు – నేడు పనులను నిర్వహించిన హెడ్మాస్టర్ / టీచర్ లకు ఆర్జిత సెలవులను ఇవ్వడానికి ఆదేశిస్తామని తెల్పారు


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this