SP Balu: ఎంతో మంది యువ గాయనీ గాయకులకు అవకాశం కల్పించి వారి ప్రతిభను వెలుగులోకి తెచ్చిన కార్యక్రమం ‘పాడుతా తీయగా’. దివంగత గాయకుడు, గాన గంధర్వుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ వచ్చారు. కేవలం పాటలతోనే కాకుండా రసవత్తరమైన విషయాాలతో సాగిన ఈ ప్రోగామ్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఎందరో అభిమానులున్నారు. అయితే బాలు మరణం తర్వాత ‘పాడుతా తీయగా’ ప్రోగ్రామ్ ఆగింది. ఈ ప్రోగ్రామ్ ఉండదేమోనని అందరూ భావించారు. అయితే ఈటీవీ యాజమాన్యం ఆ ప్రోగ్రామ్‌ను కొత్త జడ్జిలతో షురూ చేస్తున్నారట. ఇప్పటికే కొన్ని భాగాలకు సంబంధించిన చిత్రీకరణ కూడా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే ఈసారి ఒకే వ్యక్తి జడ్జ్‌గా వ్యవహరించరు. ఎస్పీబీ తనయుడు చరణ్ సహా రైటర్ చంద్రబోస్, సింగర్ సునీతలు కూడా జడ్జ్‌లుగా వ్యవహరిస్తారు. బాలు స్థానాన్ని ఎవరు భర్తీ చేయలేరనేది వాస్తవం. కానీ ఓ మంచి ప్రోగ్రామ్‌ను కంటిన్యూ చేయడం మంచి విషయమే. మరి కొత్త న్యాయ నిర్ణేతలతో ప్రారంభం కానున్న పాడుతా తీయగా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
SP Balu: ‘పాడుతా తీయగా’.. ఎస్పీబీ స్థానంలో ఎవరంటే?
వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)
-
సమాచార ఖచ్చితత్వం:
ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి. -
సమాచార ఉపయోగం:
ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము. -
లింక్‌లు & బాహ్య సైట్‌లు:
ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము. -
కాపీరైట్ & స్వామిత్వం:
ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం. -
సవాళ్లు & స్పందన:
ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.
