Good News: భారత్‌లో స్పుట్నిక్ వీ టీకా...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Good News: భారత్‌లో స్పుట్నిక్ వీ టీకా ఉత్పత్తి … సీరమ్‌కు DCGI అనుమతి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

India Covid Vaccine- Good News: పూణెకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మరో కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌‌లో ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు కూడా రావడంతో త్వరలోనే ఉత్పత్తిని మొదలుపెట్టనుంది.

పూణెకి చెందిన సీరమ్ ఇన్‌స్టిట్యూట్ మరో కోవిడ్ వ్యాక్సిన్‌ను భారత్‌‌లో ఉత్పత్తి చేయనుంది. దీనికి సంబంధించిన ప్రభుత్వ అనుమతులు కూడా రావడంతో త్వరలోనే ఉత్పత్తిని మొదలుపెట్టనుంది. భారత్‌లో స్పుట్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు సీరమ్ ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ కొన్ని షరతులకు లోబడి అనుమతి మంజూరు చేసింది. రష్యా రాజధాని మాస్కోలోని గమలెయా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమాలజీ అండ్ మైక్రో బయాలజీతో కలిసి సీరమ్ ఇన్‌స్టిట్యూట్ హదాస్‌పూర్‌ కేంద్రంలో స్పుట్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తి చేయనుంది.
స్పుట్నిక్ వీ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసేందుకు అనుమతి ఇవ్వాలని సీరమ్ గురువారం దరఖాస్తు చేసుకోగా…మరుసటి రోజే డీసీజీఐ అనుమతి మంజూరు చేయడం విశేషం. దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ల కొరత నెలకొనడం, థర్డ్ వేవ్ భయాల నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు డీసీజీఐ తక్షణ అనుమతులు మంజూరు చేసినట్లు తెలుస్తోంది. సీరమ్‌కు జారీ చేసిన లైసెన్స్ జూన్ 4 తేదీ నుంచి మూడేళ్ల వరకు అమలులో ఉంటుందని డీసీజీఐ తెలిపింది.
ఇప్పటికే కోవాక్సిన్  వ్యాక్సిన్‌ను సీరమ్ భారత్‌లో ఉత్పత్తి చేస్తోంది. త్వరలోనే స్పుట్నిక్ వీ వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా మొదలుపెడితే దేశంలో కోవిడ్ వ్యాక్సిన్లు భారీ సంఖ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశముంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this