Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Gold Price Today: స్వల్పంగా తగ్గిన బంగారం ధర.. 10 గ్రాముల ధరపై ఎంత తగ్గిందో ఆశ్యర్యపోతారు..!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Gold Price Today: దేశీయంగా గత కొన్ని రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఏర్పడుతున్నాయి. అయితే సోమవారం ఉదయానికి బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. అంటే 10 గ్రాములపై కేవలం రూ.10 మాత్రమే తగ్గింది. అయితే మరోవైపు వెండి ధర స్వల్పంగా పెరిగింది. దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,890 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,190 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,060 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,240 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,730 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,730 వద్ద కొనసాగుతోంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,190 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890, కేరళలో 22 క్యారెట్ల10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890 ఉంది. 

ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890 ఉంది. ఇక విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,740 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,890 వద్ద కొనసాగుతోంది.

అయితే సోమవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. మే నెలలో పరుగులు పెట్టి కాస్త తగ్గుముఖం పట్టగా, జూన్‌లో కూడా పై చూపులు చూసింది. ఇక తాజాగా స్వల్పంగా తగ్గింది. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌. అంతేకాదు.. ప్రస్తుతం 50 వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this