Examinations: విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షల నిర్వహణ

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Examinations: విద్యార్థుల భవిష్యత్తు కోసమే పరీక్షల నిర్వహణ

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • జులై చివరివారంలో పెట్టాలని భావిస్తున్నాం
  • 15 రోజుల ముందే టైం టేబుల్‌ జారీ చేస్తాం
  • జాగ్రత్తలతో సిద్ధంగా ఉన్నాం… అనుమతివ్వండి
  • ఇంటర్మీడియట్‌ పరీక్షలపై సుప్రీంకోర్టుకు ఏపీ ప్రభుత్వం వినతి
  • అఫిడవిట్‌ సమర్పణ
  • విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించడంలో ఇంటర్‌ మార్కులు కీలకం.

 “అప్రమత్తతతో 2021 ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించడానికి అనుమతించండి. లేదంటే కోర్టు ఏది మంచిది అనుకుంటే ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయండి.”

– సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌

Click Here to Download Affidavit  

Examinations:  ‘పదోతరగతి పరీక్షల్లో విద్యార్థులకు మార్కుల బదులు గ్రేడ్లు ఇస్తున్నాం. వివిధ పాఠశాలలు నిర్వహించే అంతర్గత పరీక్షలపై నిఘా పెట్టే అధికారం కానీ, వాటిని పర్యవేక్షించే సౌలభ్యం కానీ ఇంటర్మీడియట్‌ బోర్డుకు లేదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్‌లో అంతర్గత పరీక్షల ఆధారంగా విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తే కచ్చితమైన ఫలితాలు వచ్చే అవకాశం లేదు. రాష్ట్రంలో నిర్వహించే ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశపరీక్షల్లో 25% ఇంటర్‌ మార్కులకు వెయిటేజి ఉంటుంది. కొవిడ్‌ కేసులు మే 20న 22,610, 21న 20,937, 22న 19,981 రాగా.. జూన్‌ 20న 5,646, 21న 5,541, 22న 4,169 వచ్చాయని.. ఇలా కేసులు తగ్గుతున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని పరీక్షలు నిర్వహించడమే విద్యార్థులకు ప్రయోజనకరమని అధికారులు భావించారు’ అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశవ్యాప్తంగా అత్యధిక రాష్ట్రాలు కొవిడ్‌ నేపథ్యంలో పరీక్షల రద్దుకు మొగ్గు చూపినా ఆంధ్రప్రదేశ్‌, కేరళ ప్రభుత్వాలు మాత్రం వాటి నిర్వహణకే మొగ్గుచూపిన నేపథ్యంలో సుప్రీంకోర్టు పరీక్షల నిర్వహణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో అఫిడవిట్‌ దాఖలుచేయాలని ఆదేశించింది. అందుకు జులై 1 వరకు సమయం అడిగినా ఇవ్వకుండా బుధవారం లోపు దాఖలుచేయాలని ఆదేశించడంతో రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌ పేరున రాష్ట్ర ప్రభుత్వం 8 పేజీల అఫిడవిట్‌ సమర్పించింది. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా జాగ్రత్తలతో తలపెట్టిన పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని కోరింది. ఇప్పటికే నిపుణులతో సంప్రదించామని, ప్రస్తుత పరిస్థితులు పరీక్షల నిర్వహణకు అనుకూలంగా ఉన్నట్లు వారు అభిప్రాయపడ్డారని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం జులై చివరివారంలో పరీక్షలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలిపింది. కచ్చితమైన టైంటేబుల్‌ను త్వరలో జారీచేస్తామని పేర్కొంది. విద్యార్థులు, తల్లిదండ్రులకు కనీసం 15 రోజుల ముందే ఇది చెబుతామని వెల్లడించింది.

■ ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించబోయే ఇంటర్‌ పరీక్షలకు ప్రథమ సంవత్సర విద్యార్థులు 5,12,959 మంది, ద్వితీయ సంవత్సర విద్యార్థులు 5,19,510 మంది హాజరుకానున్నారు.

■ పరీక్షలు రోజు మార్చి రోజు జరుగుతాయి. ఆర్ట్స్‌ విద్యార్థులైతే 5, సైన్స్‌ విద్యార్థులైతే ఆరు సబ్జెక్టుల పరీక్షలకు హాజరుకావాలి. అంటే ఒక్కో సంవత్సరం విద్యార్థి 5, 6 రోజులు మాత్రమే రావాల్సి ఉంటుంది.

■ దాదాపు 25్ఠ25 అడుగుల విస్తీర్ణంలో ఉండే పరీక్ష గదిలోకి 15-18 మంది విద్యార్థులనే అనుమతిస్తాం.

■ఒక్కో విద్యార్థి మధ్య కనీసం 5 అడుగుల దూరం పాటిస్తాం.

* పరీక్ష కేంద్రాలను రోజూ శానిటైజ్‌ చేయిస్తాం.

■ ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మాస్కులు, శానిటైజర్లు, థర్మల్‌ స్కానర్లు అందుబాటులో ఉంచుతాం.

■ పరీక్ష కేంద్రంలోకి ప్రవేశించే ముందు టీచర్లు, విద్యార్థులను థర్మల్‌ స్కానర్‌తో పరీక్షిస్తారు.

■ విద్యార్థులకు ఏ గదులను కేటాయించిందీ పలుచోట్ల ప్రదర్శిస్తాం. దానివల్ల పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ తగ్గించడానికి వీలవుతుంది. విద్యార్థులకు ఒక రోజు ముందే పరీక్ష కేంద్రంలోని సీటు వివరాలు తెలియజేసేందుకు వీలుగా ఇంటర్మీడియట్‌ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో ‘నో యువర్‌ సీట్‌’ అన్న ఆప్షన్‌ ఏర్పాటు చేస్తున్నాం.

■ ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక వైద్యాధికారిని, అవసరమైన మందుల కిట్‌ను ఏర్పాటుచేస్తాం.

■పరీక్ష కేంద్రాల్లో రద్దీని తగ్గించడానికి వీలుగా కేంద్రాల్లోకి విద్యార్థులను చాలా ముందుగానే అనుమతించాలని ఎగ్జామినేషన్‌ సెంటర్‌ చీఫ్‌ సూపరింటెండెంట్లను ఆదేశిస్తాం.

■ ప్రతి పరీక్షా కేంద్రానికి ప్రత్యేక ప్రవేశ, నిష్క్రమణ ద్వారాలు ఏర్పాటుచేస్తాం. దానివల్ల రద్దీని తగ్గించడానికి, భౌతిక దూరం పాటించడానికి వీలవుతుంది.

■ సిబ్బంది అందరికీ టీకాలు అందించేందుకు జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్యఆరోగ్య అధికారులను సంప్రదించాలని రీజినల్‌ ఇన్‌స్పెక్షన్‌ ఆఫీసర్లకు సూచించాం.

■పరీక్షల నిర్వహణ, ఎవాల్యుయేషన్‌ విధుల్లో సుమారు 50 వేల మంది సిబ్బంది పాల్గొనే అవకాశం ఉంది.

■ కొవిడ్‌ నియంత్రణ కోసం పరీక్ష కేంద్రాల్లో ప్రామాణిక నిర్వహణ నిబంధనలను అనుసరించాలని సిబ్బందికి ఆదేశాలిస్తాం.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this