Corona Deaths: 1621 మంది ఉపాధ్యాయుల మరణం

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Corona Deaths: 1621 మంది ఉపాధ్యాయుల మరణం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Corona Deaths: యుపి లో జౌన్‌పూర్‌ లో నివసించే 27 సంవత్పరాల కళ్యాణి అనే టీచర్‌ 8 నెలల గర్భవతి. ఆమెకు పంచాయితీ ఎన్నికల నిర్వహణ డ్యూటీ వేసింది యుపి ప్రభుత్వం. 

  • మానవత్వం లేని యుపి ప్రభుత్వం

ఆమె ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఎన్నికల విధులనుండి మినహాయింపు ఇవ్వాలని పెట్టుకున్న అభ్యర్ధనను తోసిపుచ్చారు అధికారులు. పైగా ఎన్నికల విధులకు హాజరు కాని ఉపాధ్యాయులపై క్రిమినల్‌ కేసులు పెడతామని ప్రకటించారు. ఉద్యోగం పోతుందన్న భయంతో కళ్యాణి ఏప్రిల్‌ 14 న ఎన్నికల విధుల శిక్షణకు, ఏప్రిల్‌ 15నుండి ఎన్నికల విధులకు హాజరైంది.ఏప్రిల్‌ 17 నుండి ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. ఆక్సిజన్‌ స్థాయిలు పడిపోసాగాయి. ఆస్పత్రిలో చేర్చినా ఫలితం లేకపోయింది. ఆమె ఏప్రిల్‌ 24న మరణించారు.

సిద్ధార్థ్‌ నగర్‌ కు చెందిన లల్లన్‌ రామ్‌, ఆయన భార్య మీనాకుమారి ఇద్దరూ స్కూల్‌ ప్రిన్సిపాల్స్‌ గా పని చేస్తున్నారు. ఏప్రిల్‌ 11న ఎన్నికల విధులకు ఇద్దరూ హాజరయ్యారు. ఏప్రిల్‌ 17 నుండి వారిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. లల్లన్‌ రామ్‌కు పరీక్షలో కరోనా నెగెటివ్‌ వచ్చింది. కాని ఆరోగ్య పరిస్థితి ఇంకా దిగజారుతూండడంతో ఆస్పత్రులలో అడ్మిషన్‌ కోసం ప్రయత్నించాడు. నెగెటివ్‌ రిపోర్టు ఉందని ఆస్పత్రులు అతడిని చేర్చుకోలేదు. అతి కష్టం మీద ఏప్రిల్‌ 24న ఆస్పత్రిలో బెడ్‌ దొరికింది. ఆ మర్నాడే అతను మరణించాడు. విద్యాశాఖ మాత్రం ఎన్నికల విధులకు గైరుహాజరయ్యాడంటూ అతనిపై కేసు పెట్టింది. ఇది ఆ ప్రభుత్వపు క్రూరత్వానికి పరాకాష్ట ! లల్లన్‌ రామ్‌ భార్య పరిస్థితి కూడా దిగజారి చివరకు ఆమె మే 4న మరణించారు. తనభర్త మరణించిన విషయం ఆమెకు తెలియనేలేదు !

ఇలా బలవంతంగా ఎన్నికల విధులకు పంపబడి కరోనా తో మరణించిన ఉపాధ్యాయులు యుపిలో 1621 మంది !

ఏప్రిల్‌ 28న అప్పటికి మరణించిన 708 మంది ఉపాధ్యాయుల జాబితాను జతచేస్తూ యుపి ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది. మరణించిన టీచర్ల కుటుంబాలకు నష్ట పరిహారం చెల్లించాలని, లేని పక్షంలో ఎన్నికల కౌంటింగ్‌ ను బారుకాట్‌ చేస్తామని హెచ్చరించింది. సుప్రీం కోర్టును కూడా ఆశ్రయించింది. కాని, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కౌంటింగ్‌ జరిపితీరాలని ఆదేశించింది. ఏ కౌంటింగ్‌ సెంటర్‌ వద్దా 75 మందికి మించి ఉండకూడదని నిబంధన పెట్టింది. కాని ఆ నిబంధనను అన్ని పార్టీలూ బేఖాతరు చేశాయి. పోలీసులు ప్రేక్షకపాత్ర పోషించారు. కౌంటింగ్‌ క్రమంలో మరికొంతమంది టీచర్లు కరోనా బారిన పడి మరణించారు

మొత్తం మరణించిన టీచర్లు 1621 మంది కాగా కేవలం ముగ్గురు మాత్రమే ఎన్నికల విధులలో కరోనా తో మరణించారని ప్రభుత్వం నిర్ధారించింది అలహాబాద్‌ హైకోర్టు మరణించిన ఒక్కో టీచరు కుటుంబానికీ కోటి రూపాయల చొప్పున నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించినా దానిని పట్టించుకోకుండా ఒక్కొక్కరికీ రు30 లక్షల నష్టపరిహారాన్ని ప్రకటించింది యోగి ఆదిత్యనాధ్‌ ప్రభుత్వం ఉపాధ్యాయుల మరణాలకు కనీసం సంతాపాన్ని కూడా ప్రకటించలేదు కరోనా పరిస్థితిపై వాస్తవాలను వెల్లడించకుండా ఏదోవిధంగా స్థానిక ఎన్నికలను జరిపి తామే నెగ్గామని అనిపించుకోవాలని యోగి ప్రభుత్వం నానా పాట్లూ పడింది కాని ఆ పార్టీ చిత్తుగా ఓడిపోయింది

పాలకపార్టీ అధికార జూదంలో 1621 మంది టీచర్లు మరణించారు వారి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయాయి!


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this