Biometric Salary Link: గ్రామ, వార్డు సచివాలయ...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

AP Mandal Wise Surplus Teachers List 2026: Check District & Mandal Details

ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మరియు ఉపాధ్యాయుల బదిలీలు (AP Teachers Transfers) లేదా...

AP Teachers District Options Portal: Live Trends & Rank Check

AP Teachers District Options Portal: Check Live Trends &...

సుప్రీంకోర్టు తీర్పు: టెట్ (TET) అర్హత గడువు 2028 వరకు పొడిగింపు | Supreme Court TET Verdict

సుప్రీంకోర్టు తీర్పు: ఉపాధ్యాయులకు టెట్ (TET) అర్హత గడువు పొడిగింపు ఉపాధ్యాయ అర్హత...

Biometric Salary Link: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్‌ హాజరు తప్పనిసరి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

  • జూలై 1 నుంచి బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే వేతనాలు
  • మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా వినతుల స్వీకరణ 
  • ఆ సమయంలో ఉద్యోగులందరూ సచివాలయాల్లోనే ఉండాలి 
  • క్షేత్రస్థాయి లేదా సమావేశాలకు వెళ్తే మూమెంట్‌ రిజిష్టర్‌లో రాయాలి

Biometric Salary Lik: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరును కార్యాలయానికి వచ్చినప్పుడు, కార్యాలయం నుంచి వెళ్లే సమయాల్లో వేయాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ కమిషనర్, డైరెక్టర్‌ నారాయణ భరత్‌ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జూలై 1వ తేదీ నుంచి బయోమెట్రిక్‌ హాజరు ఆధారంగానే వేతనాలు చెల్లించాలని నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇక నుంచి హెఆర్‌ఎంఎస్‌లోనే సెలవులకు దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 వరకు తప్పనిసరిగా కార్యాలయాల్లోనే ఉండి ప్రజల నుంచి వచ్చే వినతులను రోజూ తీసుకోవాలని పేర్కొన్నారు.

🌻క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాలకు హాజరై ప్రజా వినతులను స్వీకరించాలని, అదే సమయంలో బయోమెట్రిక్‌ హాజరు వేయాలన్నారు. క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించే ఉద్యోగులు బయోమెట్రిక్‌ ఒక సారికి, రెండో సారి వేయడానికి కనీసం రెండు గంటల గ్యాప్‌ ఉండాలని పేర్కొన్నారు. కార్యాలయాల పనివేళల్లో డిజిటల్‌ అసిస్టెంట్, వార్డు విద్య అండ్‌ డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శి తప్పనిసరిగా ఉండాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది సమావేశాలు, లేదా విధుల్లో భాగంగా ఎక్కడికైనా వెళితే మూమెంట్‌ రిజిష్టర్‌లో తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు రేపటి నుంచే బయోమెట్రిక్‌ హాజరు అమలయ్యేలా కలెక్టర్లు, జేసీలు చర్యలు తీసుకోవాలని సూచించారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this