Aarogya Setu New Feature: ఆరోగ్య‌సేతులో కొత్త...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

Aarogya Setu New Feature: ఆరోగ్య‌సేతులో కొత్త ఫీచ‌ర్‌.. హోమ్ స్క్రీన్‌పై వ్యాక్సినేష‌న్ వివ‌రాలు.. డ‌బుల్ టిక్స్‌తో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Aarogya Setu New Feature: క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలను అందిస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆరోగ్య‌సేతు యాప్‌ను తీసుకొచ్చిన విష‌యం తెలిసిందే. 

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ ఆధ్వ‌ర్యంలో న‌డిచే ఈ యాప్ ద్వారా దేశవ్యాప్తంగా న‌మోదువుతోన్న కేసుల వివ‌రాలు, యూజర్ల‌కు ద‌గ్గ‌ర్లో ఉన్న కొవిడ్ రోగుల వివ‌రాల‌ను అందిస్తుంది. అయితే త‌ద‌నంత‌రం దేశ వ్యాప్తంగా వ్యాక్సిన్ ప్ర‌క్రియ మొద‌లైన త‌ర్వాత వ్యాక్సిన్ రిజిస్ట్రేష‌న్ కూడా యాప్ ద్వారా చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు.

ఇదిలా ఉంటే తాజాగా ఆరోగ్య సేతు యాప్‌లో మ‌రో కొత్త ఫీచ‌ర్‌ను తీసుకొచ్చారు. ఇప్ప‌టికే ఆఫీసుల్లోకి, ఇత‌ర ప్ర‌దేశాల‌కు అనుమ‌తి కోసం ఆరోగ్య‌సేతు యాప్‌ను చూపిస్తున్న నేప‌థ్యంలో వ్యాక్సినేష‌న్ వివ‌రాల‌ను యాప్‌లో పొంది ప‌రిచారు. స‌ద‌రు యూజ‌ర్ రెండు డోస్‌ల వ్యాక్సిన్ తీసుకున్న‌ట్ల‌యితే.. యాప్‌ హోమ్ స్క్రీన్ డబుల్ బార్డర్‌ను చూపడంతో పాటు, ఆరోగ్య సేతు లోగోలో రెండు బ్లూ టిక్స్ డిస్ ప్లే చేస్తుంది. ఒక వేళ సింగిల్ డోస్ వ్యాక్సిన్ తీసుకుంటే.. వారికి హోమ్ స్క్రీన్‌పై ‘పార్షియల్లీ వ్యాక్సినేటెడ్’ స్టేటస్‌తో పాటు ఒకే టిక్‌తో ఆరోగ్య సేతు లోగో డిస్ ప్లే అవుతుంది.

దీన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలంటే..

* యాప్‌లోకి లాగిన్ కాగానే.. స్క్రీన్‌పై క‌నిపించే ‘అపడేట్ వ్యాక్సినేషన్ స్టేటస్’ క్లిక్ చేయాలి.

* అనంత‌రం రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌ను న‌మోదు చేయాలి.

* వెంట‌నే మొబైల్ నెంబ‌ర్‌కు ఓటీపీ వ‌స్తుంది. దాన్ని ఎంట‌ర్ చేయాలి.

* వ్యాక్సిన్ తీసుకునే స‌మ‌యంలో ఇచ్చిన రిజిస్ట‌ర్ నెంబ‌ర్ వెరిఫై కాగానే.. యాప్‌లో ప్రొఫైల్స్ జాబితా క‌నిపిస్తుంది.

* ప్రొఫైల్‌పై క్లిక్ చేయ‌గానే టీకా స్టేటస్ కొవిన్ బ్యాకెండ్ నుండి నిర్ధారణ అవుతుంది.

* అనంత‌రం ఆరోగ్య సేతు యాప్‌లో వ్యాక్సిన్ వివ‌రాలు అప్‌డేట్ అవుతాయి.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this