White Fungus: బ్లాక్ ఫంగసే కాదు..ఇప్పుడు జనాన్ని...

Nearest 10 100 1000: ఇంటరాక్టివ్ రౌండింగ్ నంబర్స్ టూల్

Nearest 10 100 1000 లకు సంఖ్యలను సులభంగా రౌండ్ చేయడం...

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ & డ్రాప్ లెర్నింగ్ టూల్

Roman Numerals in Telugu: పిల్లల కోసం బెస్ట్ డ్రాగ్ &...

AP MDM Claim Bill Generator 2026 – Duniya360: పూర్తి రిపోర్ట్స్ కేవలం నిమిషాల్లో!

AP MDM Claim Bill Generator 2026: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల...

AP DEECET 2026 ఫలితాలు విడుదల: ర్యాంక్ కార్డ్ డౌన్‌లోడ్ & క్వాలిఫైడ్ లిస్ట్ (అన్ని సబ్జెక్టులు)

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న వేలాది మంది భవిష్యత్ ఉపాధ్యాయుల నిరీక్షణకు తెరపడింది!...

White Fungus: బ్లాక్ ఫంగసే కాదు..ఇప్పుడు జనాన్ని భయపెడుతున్న వైట్ ఫంగస్..దీని లక్షణాలు ఏంటో తెలుసా?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

White Fungus:  బ్లాక్ ఫంగస్ నే కాదు..ఇప్పుడు వైట్ ఫంగస్ కూడా జనాన్ని భయపెడుతోంది. ఇప్పుడు దేశమంతటా కోవిడ్‌తో పాటు  బ్లాక్ ఫంగస్ టెన్షన్ పుట్టిస్తోంది. తాజాగా దేశంలో వైట్ ఫంగస్ కేసులు కూడా నమోదవుతున్నాయి. బ్లాక్ ఫంగస్ కన్నా  వైట్ ఫంగస్ ప్రమాదకరం కావడం ఆందోళన కలిగిస్తోంది. వైస్  ఫంగస్ బారినపడుతున్న పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. బిహార్‌లోని పాట్నా మెడికల్ కాలేజీలో నాలుగు వైట్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. పాట్నా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌‌కు చెందిన మైక్రో బయాలజీ హెడ్ డాక్టర్ ఎస్ ఎన్ సింగ్ ఈ వైట్ ఫంగస్ కేసులు గుర్తించారు. ఈ ప్రాణాంతక వైట్ ఫంగస్ ఊపిరితిత్తులను దెబ్బతీస్తోంది. సరైన సమయంలో చికిత్స తీసుకోకుంటే ప్రమాదమేనని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధి ముదిరితే ఇది ఊపిరితిత్తుల నుంచి గోళ్లు, చర్మం, కడుపు, మూత్రపిండాలు, మెదడు, మర్మాంగాలు, నోటికి వ్యాపించే ప్రమాదముంది.

వైట్ ఫంగస్‌ను ఎలా గుర్తించారంటే?

కరోనా లక్షణాలతో ఉన్న నలుగురు వ్యక్తులకు పరీక్షలు నిర్వహించారు. కరోనా రోగులకు చేసిన రాపిడ్ యాంటిజెన్, రాపిడ్ యాంటీబాడీ, ఆర్టీ-పిసిఆర్ పరీక్షలు నిర్వహించారు. అన్నీ పరీక్షల్లో నెగటివ్ గా రిపోర్టులు వచ్చాయి. అయితే వీరిలో కరోనా లక్షణాలు ఎక్కువగా ఉన్నందున మరోసారి హెచ్ ఆర్ సిటీ పరీక్ష నిర్వహించారు. మరోసారి వచ్చిన ఫలితాల్లోను కరోనా నెగెటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. ఈసారి మ్యూకస్ కల్చర్‌ను పరీక్షించారు. ఈ పరీక్షల్లో వైట్ ఫంగస్ బయటపడింది. ఊపిరితితుల్లో వైట్ ఫంగస్‌ను గుర్తించి వెంటనే యాంటి ఫంగల్ డ్రగ్స్ ఇచ్చారు వైద్యులు. సకాలంలో చికిత్స మొదలుపెట్టడంతో బాధితులు కోలుకుంటున్నారు. ప్రారంభ దశలోనే వైట్ ఫంగస్‌ను గుర్తించి, చికిత్స మొదలుపెడితే ప్రమాదమేమీ లేదంటున్నారు నిపుణులు. కానీ ఆలస్యంగా గుర్తిస్తే మాత్రం ప్రాణాలకే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

వీరికి వైట్ ఫంగస్ రిస్క్ ఎక్కువ…

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ వస్తోంది. వైట్ ఫంగస్ మాత్రం కరోనా లక్షణాలున్న వారిలో బయటపడుతోంది. వైస్ ఫంగస్… బ్లాక్ ఫంగస్ కన్నా ప్రమాదకరమని పాట్నా మెడికల్ కాలేజి వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒకరిలో కరోనా లక్షణాలు ఎక్కువగా కనిపించినా…పరీక్షల్లో నెగెటివ్ వస్తే మాత్రం వైట్ ఫంగస్‌కు సంబంధించిన పరీక్షలు తప్పనిసరి అంటున్నారు. ఇందు కోసం వీరికి మ్యూకస్ కల్చర్ పరీక్ష చేయించాలని సూచిస్తున్నారు. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి పరీక్షలు మస్ట్ అంటున్నారు. డయాబెటిస్ రోగులు, చాలా కాలంగా స్టెరాయిడ్స్ తీసుకుంటున్న వారికి ఎక్కువగా వైట్ ఫంగస్ బారినపడే అవకాశం ఉందంటున్నారు. బిహార్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండగా…ఇప్పుడు వైట్ ఫంగస్ కేసులు వెలుగులోకి రావడంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this