Weekly Astrology: రాశి ఫలాలు... మే 23...

AP Inter Results 2026 Today Live: Direct Links for 1st & 2nd Year Results, WhatsApp Mana Mitra Process, SMS Method

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్యార్థుల నిరీక్షణకు తెరపడింది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్...

AP SSC Hall Ticket 2026 Released – Download 10th Class Hall Ticket

The Board of Secondary Education Andhra Pradesh (BSEAP) has...

Income Tax Software 2025–26 (AY 2026–27) – లేటెస్ట్ వెర్షన్ అందుబాటులో!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు ఉపాధ్యాయుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, 2025–26...

Weekly Astrology: రాశి ఫలాలు… మే 23 నుంచి 29 వరకు వార ఫలాలు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

 Horoscope Weekly: వారం వారం రాశి ఫలాలు మారిపోతూ ఉంటాయి. ఒక వారం కొన్ని రాశుల వారికి కలిసొస్తే… మరో వారం మరికొన్ని రాశుల వారికి కలిసొస్తుంది. 

ప్రధానంగా కష్టాల్లో ఉన్న వారు వాటిని అధిగమించి పైకి రావాలి. అందుకు రాశి ఫలాలు కొన్ని సూచనలు చేస్తాయి. హామీలు ఇవ్వవద్దు అని చెప్పినప్పుడు ఇవ్వకపోవడమే మేలు. హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోతే… చెడ్డ పేరు వస్తుంది. అలాగే ఆరోగ్యం జాగ్రత్త అన్నప్పుడు… ఆరోగ్యంపై ఎక్కువ దృష్టి పెట్టవచ్చు. అలాగే ఆర్థిక వ్యవహారాలు, ఆస్తులు, ప్రేమలు, పెళ్లిళ్లు… అన్ని అంశాలపైనా జ్యోతిష పండితులు తమదైన శైలిలో పంచాంగం చెబుతున్నారు. మరి మే 23 నుంచి మే 29 వరకూ వార ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం.

మేష రాశి (Aries) ఉద్యోగంలో అదనపు బాధ్యతలు స్వీకరించాల్సి వస్తుంది. వ్యాపారులకు అభివృద్ధి కనిపిస్తోంది. సంతాన యోగం ఉంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలకు ఇది అనుకూల సమయం. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. సామాజిక కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. వాదనలు, వివాదాలకు దిగవద్దు. సంతానం కలిగే సూచనలు కనిపిస్తాయి. ఆర్థిక లావాదేవీల వల్ల డబ్బు నష్టపోతారు. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, జర్నలిస్టులు తదితర వృత్తుల వారికి సమయం అనుకూలంగా ఉంది. రియల్‌ ఎస్టేట్‌ వారికి బాగుంటుంది.

వృషభ రాశి (Taurus) నిరుద్యోగులకు కాలం కలిసి వస్తుంది. ప్రేమించిన వారితో పెళ్లి జరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో ప్రశాంత వాతావరణం చోటు చేసుకుంటుంది. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపారంలో భాగస్వామలు సహకరిస్తారు. వృత్తి నిపుణులకు అనుకూల సమయం. డాక్టర్లకు బాగా పని ఒత్తిడి ఉంటుంది. టెక్నాలజీ రంగంలో ఉన్నవారికి అభివృద్ధి ఉంటుంది. సహోద్యోగులతో విభేదాలకు అవకాశం ఉంది.

మిథున రాశి (Gemini) ఉద్యోగంలో ప్రమోషన్‌ వచ్చే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తోంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంత వరకు బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అవి భవిష్యత్తులో సత్ఫలితాలను ఇస్తాయి. కుటుంబ సమస్య ఒకటి అనుకోకుండా పరిష్కారం అవుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రతి పనీ ఆలస్యం అవుతుంది. తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి. కొద్దిగా ఆరోగ్య సమస్యలు తప్పవు. రాజకీయ, సామాజిక రంగాల వారు అభివృద్ధి సాధిస్తారు.

కర్కాటక రాశి (Cancer) ఉద్యోగంలో సానుకూల మార్పులు, చేర్పులు చోటు చేసుకుంటాయి. అధికారులు మీ ప్రతిభను గుర్తిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది కానీ, ఖర్చులు పెరుగుతాయి. అదనపు ఆదాయం కోసం ఆలోచిస్తారు. సమాజంలో పలుకుబడి కలిగినవారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగ, వ్యాపారాల్లో బాగా ఒత్తిడి ఉన్నా ఫలితం ఉంటుంది. విందు, విహారాలు ఎక్కువగా ఉంటాయి. శుభవార్తలు వింటారు. ఇంజనీర్లకు, ఐ.టి నిపుణులకు, న్యాయవాదులకు అన్ని విధాలా బాగుంటుంది. కుటుంబం అభివృద్ధి విషయంలో కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

సింహ రాశి (Leo) సమయం అనుకూలంగా ఉంది. మంచి నిర్ణయాలు తీసుకుని ఆచరణలో పెట్టండి. నిరుద్యోగులకు ఉద్యోగాలకు సంబంధించి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. చేయాల్సిన పనులన్నీ శ్రమ మీద పూర్తవుతాయి. మీ సహాయం పొందినవారు ముఖం చాటేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి ఒక మోస్తరుగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారు పురోగతి సాధిస్తారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు ఆర్థిక రంగంలో ఉన్నవారికి కాలం కలిసి వస్తుంది. పెళ్లి సంబంధం కుదురుతుంది.

కన్య రాశి (Virgo) గ్రహ సంచారం పూర్తిగా అనుకూలంగా లేనందువల్ల ఈ వారం మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. ఉద్యోగానికి సంబంధించి మంచి సంస్థ నుంచి ఆఫర్‌ అందవచ్చు. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఉద్యోగంలో అధికారుల మెప్పు పొందుతారు. కొందరు స్నేహితుల కారణంగా అప్రతిష్ఠ పాలయ్యే అవకాశం ఉంది. వృత్తి నిపుణులకు, చిన్న వ్యాపారులకు అనుకూల సమయం. శ్రమ, తిప్పుట ఎక్కువగా ఉన్నా పట్టుదలతో ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు.

తుల రాశి (Libra) ఆదాయానికి, ఆరోగ్యానికి ఢోకా ఉండదు. గ్రహ సంచారం అనుకూలంగా లేనందువల్ల వ్యక్తిగత సమస్యలు పెరిగి ఇబ్బందులు పడతారు. పెండింగ్‌లో ఉన్న పనుల్లో చాలావరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రతికూల మార్పులు చోటు చేసుకుంటాయి. తోబుట్టువుతో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. సంతాన యోగానికి అవకాశం ఉంది. స్నేహితులకు హామీలు ఉండొద్దు. దెబ్బతింటారు. ఆహార, ఆతిథ్య రంగంలోనివారికి అనుకూల సమయం. ఇంటా బయటా బాగా ఒత్తిడి ఉండవచ్చు. వ్యాపారులు బాగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది.

వృశ్చిక రాశి (Scorpio) ఉద్యోగంలో అధికారుల నుంచి లక్ష్యాల విషయంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అయితే ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వృత్తి, వ్యాపారాల్లోనివారికి సమయం అంతగా ఆనుకూలంగా లేదు. సహనంతో వ్యవహరించడం మంచిది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభించవచ్చు. అక్రమ సంబంధాలకు దూరంగా ఉండండి. రియల్‌ ఎస్టేట్‌, రాజకీయాలు, సామాజిక సేవా రంగాలవారికి సమయం అనుకూలం. ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు రాశి (Sagittarius) అన్ని విధాలా అనుకూమైన సమయం. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. కొత్త ఆఫర్లు మీ ముందుకు వస్తాయి. ఆచితూచి నిర్ణయాలు తీసుకోండి. వ్యాపారంలో ఉన్నవారు ఆర్థిక సంబంధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది మంచి సమయం. మధ్య మధ్య అనారోగ్యాలు తప్పకపోవచ్చు. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. తిప్పుట ఎక్కువగా ఉన్నా పనులు పూర్తి చేస్తారు. ఐ.టి, వృత్తి నిపుణులకు, రియల్‌ ఎస్టేట్‌ వారికి సమయం చాలా బాగుంది.

మకర రాశి (Capricorn) ఏలిన నాటి శని కారణంగా మీకు రావాల్సిన డబ్బు సకాలంలో అందక ఇబ్బందలు పడతారు. కొన్ని పనులు బాగా ఆలస్యం అవుతుంటాయి. అంతా మన మంచికే అనుకోండి. ఉద్యోగానికి సంబంధించిన ఆఫర్లు వస్తాయి. నిరుద్యోగులకు గ్రహ సంచారం కాస్తంత అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. మీ పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. కామర్స్‌, బ్యాంకింగ్‌, ఆర్థిక రంగాల నిపుణులకు సమయం బాగుంది. వృత్తి, వ్యాపారాల్లో ఉన్నవారికి బాగా శ్రమ పెరుగుతుంది.

కుంభ రాశి (Aquarius) నిరుద్యోగులకు మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఒత్తిడి ఉన్నా లక్ష్యాలను పూర్తి చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులకు కళ్లెం వేయాలి. తిప్పుట ఎక్కువగా ఉన్నా, తలచిన పనులు పూర్తి చేస్తారు. సహోద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. చిన్ననాటి స్నేహితులతో కాలక్షేపం చేస్తారు. అనుకోకుండా దగ్గరివారితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వ్యాపార, స్వయం ఉపాధి, న్యాయ, పోలీస్‌, మిలిటరీ రంగంలో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఎవరికీ హామీలు ఉండవద్దు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీన రాశి (Pisces) ఉద్యోగంలో సహోద్యోగుల కారణంగా చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఆదాయపరంగా, ఆరోగ్యపరంగా సమయం అనుకూలంగా ఉంది. పెండింగ్‌ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. మీ దగ్గర గతంలో డబ్బు తీసుకున్నవారు తిరిగి తెచ్చి ఇస్తారు. ఆరోగ్యం పరవాలేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్త వింటారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. స్వయం ఉపాధి వారికి, చిన్న వ్యాపారులకు అభివృద్ధికి అవకాశం ఉంది. అనుకోకుండా ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఇంటా బయటా కొద్దిగా ఒత్తిడి ఉంటుంది.


వెబ్‌సైట్ సమాచార నిరాకరణ (Disclaimer)

  1. సమాచార ఖచ్చితత్వం:
    ఈ వెబ్‌సైట్‌లో అందించబడిన సమాచారం సాధారణ సమీక్షలు మరియు సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే. ఏదైనా తాజా నోటిఫికేషన్‌లు/ఆఫీషియల్ విడుదలలకు సంబంధిత ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్‌లను సందర్శించండి.
  2. సమాచార ఉపయోగం:
    ఇక్కడ ఇచ్చిన వివరాల ఆధారంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా, సంబంధిత అధికారిక వనరుల నుండి ధృవీకరించుకోండి. మేము పొందుపరచిన సమాచారం పై ఎటువంటి బాధ్యత వహించబోము.
  3. లింక్‌లు & బాహ్య సైట్‌లు:
    ఈ సైట్ ఇతర వెబ్‌సైట్‌లకు లింక్‌లను అందించవచ్చు. వాటి కంటెంట్‌లకు మేము బాధ్యత వహించము.
  4. కాపీరైట్ & స్వామిత్వం:
    ఈ సైట్‌లోని కంటెంట్‌ను అనుమతి లేకుండా పునరుత్పాదించడం/వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించడం చట్టవిరుద్ధం.
  5. సవాళ్లు & స్పందన:
    ఏదైనా తప్పు సమాచారం కనిపిస్తే, దయచేసి admin@duniya360.com కి ఇమెయిల్ చేయండి. మేము వెంటనే సరిదిద్దుతాము.

Share post:

You may like this